దేశ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ : తండ్రిని టీవీ రిమోట్‌తో చంపిన కూతురు

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 03:49 PM IST
దేశ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ : తండ్రిని టీవీ రిమోట్‌తో చంపిన కూతురు

టైటిల్ చూసి షాక్ అయ్యారా. కానీ ఇది నిజం. టీవీ రిమోట్ తో కన్న తండ్రిని చంపింది ఓ కూతురు. ఈ చిత్రమైన ఘటన యూకేలో జరిగింది. వివరాల్లోకి వెళితే..యూకేలోని బ్రిస్టల్‌కు చెందిన నికోలా టౌన్‌సెండ్ (50) తన తండ్రి టెరెన్సే(78)తో కలిసి జీవిస్తోంది. ఓ రోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన నికోలా.. తండ్రి మీదకి టీవీ రిమోట్ విసిరింది. ఆ రిమోట్ తండ్రి తలని బలంగా తాకింది. దీంతో అతడు కిందపడ్డాడు. పక్కటెములు విరిగాయి. ఆ తర్వాత శ్వాసనాళ సంబంధ నిమోనియా(Bronchopneumonia)తో చనిపోయాడు. 12 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన టెరెన్సే చివరికి ప్రాణాలు విడిచాడు.

రిమోట్ తలకు తగలడం వల్ల అతడికి తీవ్ర గాయమైనట్లు డాక్టర్లు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నికోలాని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నికోలా బెయిల్‌ మీద బయటకు వచ్చింది. ఈ ఘటనపై కోర్టు త్వరలోనే తీర్పు వెల్లడించనుంది. ఈ కేసును కోర్టు ప్రత్యేకంగా పరిగణిస్తోంది. బ్రిటన్ చరిత్రలో టీవీ రిమోట్‌ను ఆయుధంగా ఉపయోగించి హత్య చేసిన తొలి మహిళగా నికోలాను గుర్తించింది. 

దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైనా కత్తులతో పొడిచి చంపుతారు, లేదా పదునైన ఆయుధంతో అదీ కాదంటే రాళ్లతో కొట్టి చంపుతారు. కానీ.. తేలికపాటి రిమోట్‌తో కూడా ప్రాణాలు తీయొచ్చని ఇప్పుడే తెలిసింది అని అంటున్నారు.