Sanitary Pads : చివరికి శానిటరీ ప్యాడ్స్ కూడా వదల్లేదు.. అడ్డంగా దొరికిపోయిన ఎయిరిండియా ఉద్యోగిని

అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిఘా పెంచినా విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. బంగారం స్మగ్లింగ్ కు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. తాజాగా..

Sanitary Pads : చివరికి శానిటరీ ప్యాడ్స్ కూడా వదల్లేదు.. అడ్డంగా దొరికిపోయిన ఎయిరిండియా ఉద్యోగిని

Sanitary Pads

Sanitary Pads : అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిఘా పెంచినా విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. బంగాం స్మగ్లింగ్ కు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. తాజాగా ఎయిర్‌ ఇండియా మహిళా ఉద్యోగిని భలే తెలివి చేసింది. ఏకంగా శానిటరీ ప్యాడ్స్‌లో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు ప్రయత్నించింది. అయితే అనుమానమొచ్చిన సిబ్బంది తనిఖీ చేయడంతో గుట్టు రట్టైంది.

Wi-Fi HaLow : సరికొత్త వై-ఫై టెక్నాలజీ వస్తోంది.. కిలోమీటర్ దూరంలోనూ Wi-Fi కనెక్ట్ కావొచ్చు!

మహిళ నుంచి సుమారు 2.4 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 1.1 కోట్లు ఉంటుందని తెలిపారు. కేరళ కోజికోడ్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం ఈ ఘటన జరిగింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ), ఎయిర్ కస్టమ్స్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారు.

WhatsApp Status Trick : వాట్సాప్ స్టేటస్ డౌన్‌లోడ్ చేయడం ఇంత ఈజీనా..!

షార్జా నుంచి వచ్చే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో బంగారం అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న అధికారులు విమానం కోజికోడ్‌లో ల్యాండ్‌ కాగానే తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఎయిర్‌ ఇండియా ఉద్యోగిని షహానా తన శానిటరీ ప్యాడ్స్‌లో బంగారం దాచి తీసుకొచ్చిందని మహిళా అధికారులు గుర్తించారు. లోదుస్తులు, సాక్సుల్లోనూ బంగారాన్ని దాచినట్టు అధికారులు గుర్తించారు. నిందితురాలిది కేరళలోని మలప్పురం. అంతేకాదు ఆమె దగ్గరి నుంచి ఫారిన్ బ్రాండ్ సిగరెట్లు సైతం స్వాధీనం చేసుకున్నారు.