అల్లుడితో అత్త అక్రమ సంబంధం.. చివరికి ఏం చేసిందంటే..

కడుపున పుట్టిన పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకునేది తల్లి. నిత్యం వారి క్షేమం కోరుకునేది అమ్మ మాత్రమే. అందుకే అమ్మంటే దైవంతో సమానం అంటారు. కానీ ఆ తల్లి మాత్రం

  • Published By: veegamteam ,Published On : April 21, 2020 / 08:42 AM IST
అల్లుడితో అత్త అక్రమ సంబంధం.. చివరికి ఏం చేసిందంటే..

కడుపున పుట్టిన పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకునేది తల్లి. నిత్యం వారి క్షేమం కోరుకునేది అమ్మ మాత్రమే. అందుకే అమ్మంటే దైవంతో సమానం అంటారు. కానీ ఆ తల్లి మాత్రం

కడుపున పుట్టిన పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకునేది తల్లి. నిత్యం వారి క్షేమం కోరుకునేది అమ్మ మాత్రమే. అందుకే అమ్మంటే దైవంతో సమానం అంటారు. కానీ ఆ తల్లి మాత్రం దారుణానికి ఒడిగట్టింది. ఏ తల్లి చేయని పని చేసింది. కన్న కూతురి జీవితం నాశనం చేసింది. అల్లుడిపై మోజుపడిన ఆమె కూతురికి తెలియకుండా అతడిని పెళ్లి చేసుకుంది.

అల్లుడిపై మోజుపడ్డ అత్త:
నాన్న లేని తన తల్లిని ఇంట్లో ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక.. తనతోపాటే హనీమూన్‌కు తీసుకెళ్లడం ఆ కూతురి పాలిటి శాపమైంది. కూతురి జీవితం బాగుండాలని కోరుకోవలసిన ఆ తల్లి.. అల్లుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. అతడి వల్ల గర్భం కూడా దాల్చింది. చివరికి కూతురి కళ్లుగప్పి అతడిని పెళ్లి చేసుకుంది. ఇంగ్లాండ్‌లో ఈ దారుణం జరిగింది. బాధితురాలి పేరు లౌరెన్ వాల్ (34). లౌరెన్ జీవితంలో తల్లే విలన్. అత్త-అల్లుడి మధ్య ఉన్న చనువును ఆమె ఏ రోజు అనుమానించ లేదు. చివరికి అదే ఆమె కొంప ముంచింది. 

తల్లిని కూడా హనీమూన్ తీసుకెళ్లిన కూతురు, అదే కొంప ముంచింది:
లౌరెన్.. పౌల్‌ అనే వ్యక్తిని ప్రేమించింది. అప్పటికే అతడి వల్ల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని లౌరెన్ తన తల్లి జూలీతో చెప్పగా, ఆమె వారి పెళ్లికి ఓకే చెప్పింది. ఆ తర్వాత కొత్త జంట హనీమూన్ ఏర్పాట్లు కూడా జూలీనే దగ్గరుండి చూసుకుంది. హనీమూన్‌కు కూతురు, అల్లుడితో పాటు జూలీ కూడా వెళ్లింది. తన మనవరాలిని చూసుకోవడానికి తోడు ఉంటుందనే ఉద్దేశంతో వారిద్దరు ఆమెను వెంట తీసుకెళ్లారు. 3 వారాల హనీమూన్ ట్రిప్ ముగిసిన తర్వాత అంతా ఇంటికి వచ్చారు. అయితే, పౌల్‌ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపించింది.

కూతురికి తెలియకుండా అల్లుడితో రాసలీలలు:
హనీమూన్ సమయంలో లౌరెన్ తల్లి జూలీ.. అల్లుడు పౌల్ ప్రేమలో పడిపోయింది. లౌరెన్ తన బిడ్డను బయటకు తీసుకెళ్లిన సమయంలో జూలీ అల్లుడితో ‘హనీమూన్’ కానిచ్చేసింది. ఈ విషయం లౌరెన్‌కు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇది కొనసాగింది. పౌల్.. లౌరెన్‌తో కంటే అత్తతో ఎక్కువ సేపు గడిపేందుకే ఆసక్తి చూపేవాడు. ఈ మార్పు గమనించిన లౌరెన్ కు ఎక్కడో భర్తపై అనుమానం వచ్చింది. ఓ రోజు లౌరెన్ చెల్లి జూలీ ఫోన్ తీసుకుంది. దాంతో బండారం బయటపడింది. అల్లుడితో జూలీ అశ్లీలంగా చాటింగ్ చేయడం చూసి షాకైంది. 

ఆ తర్వాత లౌరెన్ తన తల్లిని నిలదీసింది. అల్లుడితో చనువుగా మాట్లాడుతున్న విషయం నిజమే కానీ, ఎలాంటి సంబంధం లేదని జూలీ బుకాయించింది. తన అల్లుడు చాలా మంచివాడని కితాబిచ్చింది. కాగా, అత్తతో అక్రమ సంబంధం విషయం భార్య లౌరెన్‌కు తెలియడంతో పౌల్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

గర్భం దాల్చిన తల్లి:
ఓ రోజు లౌరెన్.. తన తల్లి, భర్త కలిసి వీధుల్లో తిరగడం చూసింది. ఆమె కడుపు ఎత్తుగా ఉండటంతో గర్భం దాల్చినట్లు తెలుసుకుంది. తన భర్తతో కలిసి పిల్లలు కనేందుకు కూడా ఆమె సిద్ధమైందని తెలిసి మరింత కుంగిపోయింది. ఆ ఇద్దరికి పెళ్లి కూడా జరిగిపోయిందని తెలిసి కన్నీరుమున్నీరైంది. కన్న తల్లే మోసం చేయడం తట్టుకోలేకపోయింది.