Extra Marital Affair : వివాహేతర సంబంధం-పులివెందులలో మహిళ దారుణ హత్య

వివాహేతర సంబంధంతో ఒక మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కడప జిల్లా పులివెందులలో చోటు చేసుకుంది.

10TV Telugu News

Extra Marital Affair :  వివాహేతర సంబంధంతో ఒక మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కడప జిల్లా పులివెందులలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా ఎన్.కే. కాలువ గ్రామానికి చెందిన రిజ్వానా(26) అనే మహిళకు కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన సర్ధార్‌తో  ఐదేళ్ల క్రితం పెళ్ళయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం వీరు పులివెందులలో కాపురం ఉంటున్నారు.

పెళ్లికి ముందు రిజ్వానాకు ఎన్.కే.కాలువ   గ్రామానికే చెందిన హర్షవర్ధన్‌తో   ప్రేమలో ఉంది. కానీ ఇంట్లో పెద్దలు చూసిన సర్ధార్ తో వివాహానికి ఒప్పుకుంది.  మూడు నెలల క్రితం మాజీ ప్రియుడు హర్షవర్ధన్‌తో   కలిసి ఇంట్లోంచి   వెళ్లిపోయింది. బెంగుళూరులో వారిద్దరూ కాపురం పెట్టారు.  కుటుంబ సభ్యులు గాలించి బెంగుళూరు నుంచి రిజ్వానా ను మళ్లీ పులివెందుల తీసుకవచ్చారు.
Also Read : Pensioners : పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. గడువు పెంపు
పెద్ద మనుషుల మధ్య పంచాయతీ నిర్వహించి మళ్లీ భర్త, పిల్లలతో కలిసి ఉండేటట్లు రాజీ కుదిర్చారు. అప్పటి నుంచి రిజ్వానా భర్తతో కలిసి ఉంటోంది.  ఈ రోజు ఉదయం రిజ్వానా తన ఇంటి కింద ఉన్న దుకాణం యజమానితో మాట్లాడుతూ ఉండగా ఆమె మాజీ ప్రియుడు హర్షవర్ధన్ అక్కడకు చేరుకుని కత్తితో ఆమెను దారుణంగా పొడిచి చంపాడు.

ఈ ఘటనలో ఆమె అక్కడి కక్కడే మరణించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.నిందితుడు హర్షవర్ధన్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

×