Woman Molested : సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని..ఫాం హౌస్‌కు తీసుకు వచ్చి…

సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి ఒక యువతిని ఫాం హౌస్ కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో మహారాష్ట్రలోని థానే పోలీసులు ఒక మహిళతో సహా నలుగురుని అరెస్ట్ చేశారు.

Woman Molested : సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని..ఫాం హౌస్‌కు తీసుకు వచ్చి…

Woman Molested

Woman Molested : సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి ఒక యువతిని ఫాం హౌస్ కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో మహారాష్ట్రలోని థానే పోలీసులు ఒక మహిళతో సహా నలుగురుని అరెస్ట్ చేశారు. లక్నోకు   చెందిన యువతి (24) సినిమాల్లో ఆసక్తితో   కొన్నాళ్ల క్రితం హిందీ సినిమా ఆడిషన్స్ లో పాల్గోంది. ఆసినిమాలోని ఒక పాత్రకోసం ఆమె ఎంపికయ్యింది.

ఈ నేపధ్యంలో సినిమా నిర్మాత ఆఫీసు నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. గురువారం థానే లోని జీబీ రోడ్డులో ఉన్న దర్శక, నిర్మాతలను కలవటానికి రావాలని ఆమెకు తెలిపారు. సినిమా ఆఫీసు వారు చెప్పిన ప్రదేశానికి ఆ యువతి వెళ్లింది.  తాను చేరుకున్న ప్రదేశాన్నితన తల్లి,తండ్రులకు లైవ్ లొకేషన్ షేర్ చేసి….చేరుకున్నానని చెప్పింది.  అక్కడ్నించి ఆమెను వారు ఒక కారులో ఫాంహౌస్‌కు తీసుకువెళ్లారు.

కారులో వెళుతున్నంతసేపు   సినిమా కంపెనీ సభ్యుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. అందుకు ఆమె అభ్యంతరం చెప్పి ఎదురు తిరిగింది.  ఆమెకు మారణాయుధాలు చూపిస్తూ… తమ కోర్కెలు తీరిస్తేనే సినిమాల్లో అవకాశం వస్తుందని వారు బెదిరించారు. ఆమె ఏమీ మాట్లాడకుండా వారితో పాటు ఫాం హస్ కు చేరుకుంది.

అక్కడి నుంచి ఆమె తన మొబైల్ ద్వారా తల్లితండ్రులకు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, సినిమా విభాగం కార్యకర్తలకు తాను ఆపదలో ఉన్నానని చెప్పి లోకేషన్ షేర్ చేసింది. వెంటనే అలర్టైన ఎమ్ఎన్ఎస్ కార్యకర్తలు నిమిషాల్లో ఫాంహౌస్ కు చేరుకున్నారు. అక్కడ ఉన్న సినిమా కంపెనీకి చెందిన మహిళతో సహా నలుగురిని పట్టుకుని కాసర్వదవళి పోలీసు స్టేషన్ లో అప్ప చెప్పారు.  యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు   నిందితులపై ఐపీసీ సెక్షన్ 354, 509, 506, 34 ల కింద కేసు నమోదు చేశారు. యువతిని బెదిరించిన రివారల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు.