మహిళను హత్య చేసి.. ఒంటిపై ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు

నిజామాబాద్ జిల్లాలోని ఆర్య నగర్ లో దారుణం జరిగింది. మహిళను హత్య చేసి.. ఆమెపై ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.

  • Published By: veegamteam ,Published On : March 10, 2020 / 03:55 AM IST
మహిళను హత్య చేసి.. ఒంటిపై ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు

నిజామాబాద్ జిల్లాలోని ఆర్య నగర్ లో దారుణం జరిగింది. మహిళను హత్య చేసి.. ఆమెపై ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.

నిజామాబాద్ జిల్లాలోని ఆర్య నగర్ లో దారుణం జరిగింది. ఓ వివాహితను దుండగులు దారుణంగా చంపారు. మహిళను హత్య చేసి.. ఆమెపై ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఆర్య నగర్ లో శ్రీనివాస్, వరలక్ష్మీ దంపతులు నివాసముంటున్నారు. భర్త లేని సమయంలో నిన్న రాత్రి ఇంట్లోకి దుండగులు వచ్చారు. వరలక్ష్మీని హత్య చేశారు.

ఆమె కాలివేళ్లు నరికి దారుణంగా హత్య చేశారు. వరలక్ష్మీ మృతదేహం ముందు దీపాలు పెట్టిన దుండగులు.. ఇంట్లో పసుపు, కారం చల్లి భయానక వాతావరణం సృష్టించారు. ఆమెను చంపి.. ఒంటిపై ఉన్న 5 తులాల బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే నిందితులను పట్టుకుని హత్య మిస్టరీని చేధించాలని కోరుతున్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్, వరలక్ష్మీ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లు ఇద్దరూ ఏపీలోనే చదువుకుంటున్నారు. అయితే శ్రీనివాస్, వరలక్ష్మీ బతుకు దెరువు కోసం నిజామాబాద్ జిల్లాకు వెళ్లారు. శ్రీనివాస్ మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భర్త ఇంట్లో లేని సమయంలో దుండుగులు ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి ఒడిగట్టారు. వరలక్ష్మీని హత్య చేసిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారం నగలతోపాటు ఇంట్లోని నగదును కూడా అపహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

భర్త శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రీనివాస్ ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నగర ఏసీపీ ప్రభాకర్ ఆధ్వర్యంలో కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.  

See Also | మారుతీరావు మృతికి ఆస్తి తగాదాలే కారణమా?