దారుణం.. వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగింపు

జార్ఖండ్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను అత్యంత దారుణంగా శిక్షించారు. ఆమెని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత మెడలో చెప్పుల

దారుణం.. వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగింపు

Woman Paraded Naked

Woman Paraded Naked : జార్ఖండ్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను అత్యంత దారుణంగా శిక్షించారు. ఆమెని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత మెడలో చెప్పుల దండ వేశారు. ఆపై నగ్నంగా ఊరేగించారు.

దుమ్కా జిల్లాలోని రానిశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పెళ్లైన వ్యక్తితో బాధితురాలు పరారైంది. తాజాగా వారిని పట్టుకున్న ఆ వ్యక్తి భార్య బంధువులు.. బాధితురాలిని దారుణంగా కొట్టారు. ఆ తర్వాత మెడలో చెప్పుల దండ వేసి నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన సంచలనమైంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులైన ఆరుగురిని అరెస్ట్ చేశారు.

ఎఫ్ఐఆర్ లో పోలీసులు 12మంది పేర్లు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు. భార్య, అతడి భర్తను అదుపులోకి తీసుకున్నారు. తనను దారుణంగా కొట్టి నగ్నంగా ఊరేగించడమే కాకుండా తన దగ్గరున్న రూ.25వేలు లాక్కున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.