భర్త నుంచి విడిపోయి వేరొకరితో సహజీవనం చేస్తోందని మహిళకు దారుణ శిక్ష విధించిన గ్రామస్తులు

భర్త నుంచి విడిపోయి వేరొకరితో సహజీవనం చేస్తోందని మహిళకు దారుణ శిక్ష విధించిన గ్రామస్తులు

Woman Shamed, Forced To Walk With In-Laws On Shoulders : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్త నుంచి విడిపోయి వేరోకరితో సహజీవనం చేస్తున్న మహిళకి గ్రామస్తులు దారుణ శిక్ష విధించారు. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలోని సాగై మరియు బన్స్ ఖేడీ గ్రామలమధ్య ఈదారుణం చోటు చేసుకుంది. పరస్పర అంగీకారంతో విడిపోయిన ఒక మహిళ అదే గ్రామంలో వేరొక వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

అయితే గతవారం ఆమె మాజీ భర్త కుటుంబ సభ్యులు, మరికొందరితో కలిసి ఆమె ఇంటికి వచ్చి బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆమెను దారుణంగా అవమానించారు. ఆమె మాజీ భర్త సోదరుడ్ని, ఇతర కుటుంబ సభ్యులను మహిళ భుజాల మీదకు ఎక్కించుకుని నడవాలని శిక్ష విధించారు. ఈ హేయమైన అనాగరిక చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఆమె నడవలేక ఆగిపోయినప్పుడు క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో తో ఆమెను కొడుతూరాక్షసంగా ప్రవర్తించారు. దాదాపు మూడు కిలోమీటర్లు మనిషిని ఆమె భుజాలపై ఎక్కించి నడిపించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవటంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనుక కారకులైన నలుగురిని అరెస్ట్ చేశారు.

మధ్యప్రదేశ్ లో ఈ తరహా ఘటనలు జరగటం ఇది మొదటిసారి కాదు.గతేడాది జులైలో వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలతో ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.భర్తను భుజాలపై ఎక్కించుకుని ఊరంతా తిప్పారు. ఆ ఘటనను సెల ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆకేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రెండేళ్ల క్రితం ఏప్రిల్ లో జరిగిన మరోఘటనలో ఝబువా గ్రామంలో ఒక గిరిజన మహిళ తాను ప్రేమించిన వ్యక్తితో లేచిపోయిందని ఆమెను వెతికి తీసుకువచ్చి, దారుణంగా కొట్టి హింసించారు. ఆ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. గుణ జిల్లాలో జరిగిన మరోక ఘటనలో గ్రామస్తులంతా మహిళను అవమానించిన గ్రామస్తులు ఆమె చుట్టూ చేరి హింసించారు. ఒక వృధ్దుడు ఆమెముందు  వెకిలిగా  డ్యాన్స్ కూడా చేశాడు. మధ్యప్రదేశ్ లోని కొన్ని గ్రామాల్లో మహిళల పరిస్ధితి దారుణంగా ఉంది.