ఇసుకలో మహిళ అస్థిపంజరం, గాజులు, చీర : హైదరాబాద్ లో మరో కలకలం

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో మృతదేహం కలకలం రేగింది. ఇసుకలో ఓ మహిళ పుర్రె బయటపడటం సంచలనమైంది. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురంకి చెందిన

  • Published By: veegamteam ,Published On : December 15, 2019 / 06:33 AM IST
ఇసుకలో మహిళ అస్థిపంజరం, గాజులు, చీర : హైదరాబాద్ లో మరో కలకలం

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో మృతదేహం కలకలం రేగింది. ఇసుకలో ఓ మహిళ పుర్రె బయటపడటం సంచలనమైంది. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురంకి చెందిన

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో మృతదేహం కలకలం రేగింది. ఇసుకలో ఓ మహిళ పుర్రె బయటపడటం సంచలనమైంది. వివరాల్లోకి వెళితే.. సాహెబ్ నగర్ కి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆన్‌లైన్ లో ఇసుకను కొన్నాడు. డిసెంబర్ 14న ఇసుక స్టాక్ యార్డుకు వెళ్లాడు. అక్కడ లారీలోకి ఇసుకను లోడ్ చేస్తున్న సమయంలో ఓ పుర్రె కనిపించింది. దీంతో అతడు కంగుతిన్నాడు. తనకు ఇసుక వద్దని చెప్పి వెళ్లిపోయాడు. దీనిపై అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

రంగంలోకి దిగిన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు స్టాక్ యార్డ్‌ను పరిశీలించారు. పుర్రె దొరికిన ప్రాంతంలో తవ్వి చూశారు. అక్కడ పూర్తిగా కుళ్లిన స్థితిలో అస్థిపంజరం కనిపించింది. పక్కనే గాజులు, చీర, ఓ రుద్రాక్ష మాల కూడా కనిపించాయి. దీంతో ఆ అస్థిపంజరం మహిళదై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ ఇసుకను 7 నెలల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ పరిసర వాగుల నుంచి తీసుకొచ్చి డంప్ చేశామని నిర్వాహకులు తెలిపారు. ఇసుకతో పాటు మృతదేహం కూడా అప్పుడే వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. 

అస్థిపంజరం చుట్టూ మిస్టరీ నెలకొంది. ఆ మృతదేహం ఎవరిది? ఆ మహిళ ఎలా మరణించింది? ప్రమాదవశాత్తూ చనిపోయిందా? హత్య చేశారా? ఇసుక ద్వారా వచ్చిందా లేదా చంపి ఇసుకలో పూడ్చి పెట్టారా? అనేది మిస్టరీగా మారింది. మృతదేహానికి సంబంధించిన ఆధారాలేవీ లేవు. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు.

అబ్దుల్లాపూర్ మెట్ లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ వెనుక టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక స్టాక్ యార్డు నిర్వహిస్తున్నారు. జూలై 6న ఈ స్టాక్ యార్డ్ ప్రారంభించారు. డిసెంబర్ 9న సాహెబ్ నగర్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇసుకను కొనుగోలు చేశాడు.

ఇసుకలో మహిళ అస్థిపంజరం కనిపించడం సంచలనంగా మారింది. దిశ అత్యాచారం, హత్య ఘటన తర్వాత నగరంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆడపిల్లలు, మహిళల భద్రత గురించి భయపడుతున్నారు. ఈ క్రమంలో మహిళ అస్థిపంజరం బయటపడటం కలకలానికి దారితీసింది.