Illegal Affair : అత్త,అల్లుడు ప్రేమాయణం-పారిపోయి పెళ్లి చేసుకున్నారు

Illegal Affair :  అత్త,అల్లుడు ప్రేమాయణం-పారిపోయి పెళ్లి చేసుకున్నారు

Woman & Son In Law Eloped & Got Married

Illegal Affair : సమాజంలో కొన్ని,కొన్ని సంఘటనలు చూస్తుంటే నానాటికీ విలువలు మరింత పతనమై పోతున్నాయా అని బాధ కలుగుతుంది. కామంతో కళ్లు మూసుకుపోయి  వావి వరసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నవాళ్లను చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సివస్తోంది. పచ్చటి కాపురాలు నిట్టనిలువునా చీలిపోతున్నాయి.

ఇద్దరు మనవలకు బామ్మ అయిన మహిళ, తన అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 10 నెలల క్రితం ఇద్దరూ ఇంటినుంచి పారిపోయి పెళ్లి చేసుకువచ్చారు. వీరి వివాహాన్ని కుటుంబం సభ్యులు అంగీకరించకపోటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉత్తర‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని మధుభార్ గ్రామంలో ఇద్దరు పిల్లలకు నానమ్మ అయిన 50 ఏళ్ల మహిళ, పాతికేళ్ల వయస్సున్న తన అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎప్పటి నుంచి ఈ బంధం కొనసాగుతోందో తెలియదు కానీ, 10 నెలల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు.

వేరొక గ్రామంలో నివసిస్తూ ఇద్దరూ రిజిష్టర్ మ్యారేజి చేసుకున్నారు. జూన్ 30 బుధవారం ఇద్దరూ గ్రామానికి తిరిగి వచ్చారు. తామిద్దరం పెళ్లి చేసుకున్నామని… కలిసి జీవించాలనుకుంటున్నట్లు చెప్పారు.అయితే ఇందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంగీకరించలేదు. దీంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది.

ఈ నేపధ్యంలో కుటుంబ సభ్యులు భోరాకలాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు జంటపై ఐపీసీ సెక్షన్ 151 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి గొడవ సర్దుకోవడానికి జంటను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కేసు తదుపరి విచారణ కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.