Fire Accident : గుడిలో దీపారాధన చేస్తుండగా చీరకు నిప్పంటుకుని మహిళకు గాయాలు

కార్తీక మాసం...నాగుల చవితి పుణ్యదినం సందర్భంగా పుట్టలో పాలు పోసి, దీపారధన చేస్తున్న మహళ చీరకు నిప్పంటుకుని తీవ్ర గాయాల పాలయ్యింది.

Fire Accident : గుడిలో దీపారాధన చేస్తుండగా చీరకు నిప్పంటుకుని మహిళకు గాయాలు

Fire Accident

Fire Accident :  పుణ్యానికి పోతే పాపం ఎదురైందన్నట్లు అయ్యింది ఒక మహిళకు. ఈరోజు కార్తీక మాసం…నాగుల చవితి పుణ్యదినం సందర్భంగా పుట్టలో పాలు పోసి, దీపారధన చేస్తున్న మహళ చీరకు నిప్పంటుకుని తీవ్ర గాయాల పాలయ్యింది. ఆమహిళ పరిస్ధితి ప్రస్తుతం విషమంగా ఉంది.

కృష్ణాజిల్లా గన్నవరం లోని   గుమ్మడి నాగేంద్ర స్వామి ఆలయంలో ఈ అపశృతి చోటు చేసుకుంది. ఎనికేపాడుకు చెందిన చెల్లమ్మ (30సం.) అనే మహిళ ఈ రోజు పుట్టలో పాలుపోసింది.  అనంతరం అక్కడ దీపారాధన చేయటానికి ప్రమిద పెట్టి దీపారధన చేస్తోంది. అప్పటికే ఆ చుట్టుు  పక్కల వెలిగించి ఉన్న దీపారాధనలకు  ఆమె ధరించిన చీర కొంగు తగిలింది.

Also Read :Mukesh Ambani: ముకేష్ అంబానీ ఇంటి దగ్గర హైఅలర్ట్.. ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్‌తో కలకలం..

దీంతో ఆమె చీరకు నిప్పు అంటుకుంది. ఒక్క సారిగా మంటలు ఆమె శరీరాన్ని చుట్టుముట్టాయి.  ఈ ఘటనతో ఒక్కసారిగా భక్తులు ఉలిక్కిపడ్డారు. చెల్లమ్మ కు 60% ఒంటిపై గాయాలు కావడంతో ఆమెను వెంటనే 108 అంబులెన్స్ లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చెల్లమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లుతెలుస్తోంది.