మోసం చేసిన ప్రియుడితో పెళ్లి చేయమని పోలీసులకు ఫిర్యాదు చేసిన దొంగ

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోకుండా ఒకఇంట్లోకొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ లోపు ఆ యువతి వక్రమార్గంలో ఆలోచించి.... వృధ్ధజంటకు కరోనా వ్యాక్సిన్ పేరుతో మత్తుఇంజెక్షన్ ఇచ్చి వారింట్లో బంగారు నగలు దోపిడీచేసి పారిపోయింది.పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటకు వచ్చే సరికి ప్రియుడు మొఖం చాటేసాడు. దీంతో తన ప్రియుడితో పెళ్లి చేయమని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ దొంగ ప్రియురాలు.

మోసం చేసిన ప్రియుడితో పెళ్లి చేయమని పోలీసులకు ఫిర్యాదు చేసిన దొంగ

woman thief filed a complaint against boyfriend : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోకుండా ఒకఇంట్లోకొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ లోపు ఆ యువతి వక్రమార్గంలో ఆలోచించి…. వృధ్ధజంటకు కరోనా వ్యాక్సిన్ పేరుతో మత్తుఇంజెక్షన్ ఇచ్చి వారింట్లో బంగారు నగలు దోపిడీచేసి పారిపోయింది.పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటకు వచ్చే సరికి ప్రియుడు మొఖం చాటేసాడు. దీంతో తన ప్రియుడితో పెళ్లి చేయమని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ దొంగ ప్రియురాలు.

వివరాల్లోకి వెళితే…… వికారాబాద్ కు చెందిన యువతి(21) కొన్నాళ్ల పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో నర్సుగా పని చేసింది. ఏడాది క్రితం ఆమెకు దేవరకొండకు చెందిన విజయ్(25) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఇద్దరూ భార్యాభర్తలని చెప్పుకుని కొన్నాళ్ల క్రితం జిల్లెలగూడ లలితానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేసారు.

ఈ సమయంలో ఆ యువతి… లలితానగర్ లోనే ఉన్న వృద్ద దంపతులకు కరోనా టీకా పేరుతో మత్తు మందిచ్చి వారింట్లో నగలు, నగదు దోచుకుని పరారయ్యింది. వారిచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు యువతి అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. ఆమె జైలులో ఉన్న సమయంలో ప్రియుడు విజయ్ జిల్లెల్లగూడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు.

ఇటీవల జైలు నుంచి వచ్చిన యువతి తన ప్రియుడిని కలిసి పెళ్లి చేసుకోవాలనికోరింది. అందుకు అతను నిరాకరించాడు. అప్పటి నుంచి ఆమెను కలవటానికి కూడా ఆసక్తి చూపించటం లేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. జైలు నుంచి వచ్చాక విజయ్ తనను కలవటానికి కూడా ఆసక్తి చూపించటం లేదని, ఫోన్ కూడా చేయటంలేదని అంతకు ముందు తనతో తిరిగి తనను గర్భవతిని చేశాడని ఆమె మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వారిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలను పోలీసులకు అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇస్తామని… విజయ పెళ్లికి ఒప్పుకోకపోతే చట్టప్రకారం చర్యలుతీసుకుంటామని మీర్ పేట పోలీసులు తెలిపారు.