మహిళ అని చూడలేదు… కొట్టారు… ఒంటిమీద బట్టలు లాగేశారు… చెప్పుల దండేసి…. వీధుల్లో తిప్పారు…

  • Published By: sreehari ,Published On : September 1, 2020 / 09:57 PM IST
మహిళ అని చూడలేదు… కొట్టారు… ఒంటిమీద బట్టలు లాగేశారు… చెప్పుల దండేసి…. వీధుల్లో తిప్పారు…

ఊరంతా కలిసి ఒక మహిళను చిత్రహింసలకు గురిచేశారు.. మహిళ అని చూడకుండా బట్టలు ఊడదీసి కొట్టారు.. మెడలో చెప్పుల దండేసి వీధుల వెంట తిప్పారు.. అస్సాంలోని బార్పేట జిల్లాకు చెందిన మహిళపై అక్కడి స్థానికులు ఉన్మాదుల్లా ప్రవర్తించారు. చివరికి పోలీసుల జోక్యం చేసుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోతున్న ఊరిజనం నుంచి మహిళను ప్రాణాలతో రక్షించారు.. లేదంటే గ్రామస్థుల దాడిలో మహిళ ప్రాణాలు పోయేవి..



గ్రామ పంచాయతీ వద్ద మహిళను ఈడ్చుకెళ్లి కొట్టారు.. బాధితురాలు స్థానిక పంచాయతీలో సీనియర్ పదవిలో ఉంది.. అయినప్పటికీ ఎందుకు మహిళను ఇంత దారుణంగా హింసించి కొట్టారు.. ఆమె అవినీతికి పాల్పడటమే బాధితురాలు చేసిన పాపం.. అందుకే ఆగ్రహించిన స్థానికులు ఆమెను ఈ విధంగా హింసించి కొట్టారు.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకంలో అవినీతిని నిరసిస్తూ ఈ ప్రాంతంలో నివసిస్తున్న చాలా మంది ప్రజలు పెద్ద ఎత్తునా ఉద్యమించారు. ఈ అవినీతికి తానే కారణమని స్థానికులు మహిళను తీవ్రంగా కొట్టారు.. చేసిన తప్పుకు శిక్ష పడాలని గట్టిగా అరుస్తూ మహిళను బూట్ల దండ మెడలో వేసుకోవాలని బలవంతం చేశారు గ్రామస్థులు..



అవినీతి కి పాల్పడిందని గ్రామస్థులంతా ముక్తకంఠంతో మహిళపై ఆరోపణలు చేశారు.. అంతటితో ఆగలేదు.. పంచాయతీ కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను, పత్రాలను తగలబెట్టారని ఓ నివేదిక తెలిపింది.

కేసు నమోదు చేసుకున్నామని దర్యాప్తు జరుగుతోందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్థుల్లో ఎవరిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈ ఏడాది జూలైలో.. ముజఫర్‌పూర్‌కు చెందిన ఒక మహిళను అంగన్‌వాడీ కార్మికుడు, ఆమె భర్త కొంతమంది గ్రామస్తులు చితకబాదారు.



అంగన్‌వాడీ కార్మికుడితో వాగ్వాదానికి దిగడంతో మహిళను కొట్టారు. బాధిత మహిళ స్థానిక పోలీసులను ఆశ్రయించగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అక్కడి పోలీసులు నిరాకరించారని పోలీసులు తెలిపారు..