Chandigarh: మహిళపై అత్యాచారయత్నం.. అనంతరం ప్రయాణిస్తున్న రైలు నుంచి తోసేసిన దుర్మార్గుడు

20 నిమిషాల క్రితమే తన భార్య తనకు ఫోన్ చేసి దగ్గరికి వచ్చానని, పికప్ చేసుకోవడానికి రమ్మని చెప్పినట్లు.. తీరా చూస్తే ఆమె ఇక లేదనే వార్త తెలిసిందని భర్త వాపోయాడు. ట్రైన్ దిగిన అనంతరం తొమ్మిదేళ్ల కుమారుడు ఏడుస్తూ పరుగు పరుగున ట్రైన్ దిగి తండ్రికి జరిగిన విషయం చెప్పాడు. గత వారమే తన భార్య రోహ్‭తక్ వెళ్లిందని, గురువారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఇలా జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Chandigarh: మహిళపై అత్యాచారయత్నం.. అనంతరం ప్రయాణిస్తున్న రైలు నుంచి తోసేసిన దుర్మార్గుడు

Woman Thrown Off Train In Sex Assault Bid

Chandigarh: హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై అత్యాచారం చేయబోయాడు. అయితే ఆమె అతడితో కొట్లాడి గట్టిగా ప్రతిఘటించడంతో తీవ్ర కోపానికి గురైన ఆ దుర్మార్గుడు ప్రయాణిస్తున్న రైలు నుంచి ఆమెను బయటికి తోసేసాడు. ఈ ఘటనలో సదరు మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమెతో పాటు ప్రయాణంలో ఉన్న తొమ్మిదేళ్ల కుమారుడు.. రైలు దిగిన అనంతరం జరిగిన సంగతి తండ్రికి చెప్పడంతో వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించాడు.

ఫతేబాద్ సమీపంలోని తోహానీ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిందీ దారుణం. రైలు బోగీలో 27 ఏళ్ల సందీప్‭తో పాటు 30 ఏళ్ల మహిళ, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నారు. ఒంటరిగా ఉన్న సదరు మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఆమె గట్టిగా ప్రతిఘటించింది. ఇది తట్టుకోలేని సందీప్.. ఆమెను ట్రైన్ నుంచి కిటికీ ద్వారా బయటకు తోసేసాడు. అనంతరం సందీప్ సైతం ట్రైన్ దూకాడు. కాగా, తీవ్ర గాయాలపాలైన సందీప్‭ను గుర్తించి, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

SC Dismiss Sanskrit Plea: సంస్కృతాన్ని జాతీయ భాష చేయాలంటూ పిటిషన్.. సుప్రీం స్పందనేంటంటే?

20 నిమిషాల క్రితమే తన భార్య తనకు ఫోన్ చేసి దగ్గరికి వచ్చానని, పికప్ చేసుకోవడానికి రమ్మని చెప్పినట్లు.. తీరా చూస్తే ఆమె ఇక లేదనే వార్త తెలిసిందని భర్త వాపోయాడు. ట్రైన్ దిగిన అనంతరం తొమ్మిదేళ్ల కుమారుడు ఏడుస్తూ పరుగు పరుగున ట్రైన్ దిగి తండ్రికి జరిగిన విషయం చెప్పాడు. గత వారమే తన భార్య రోహ్‭తక్ వెళ్లిందని, గురువారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఇలా జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

కాగా, తోహానా రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‭పెక్టర్ జగ్దీష్ ఈ విషయమై స్పందిస్తూ.. భద్రతా సమస్యలో ఉన్న లోపంపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. నిజానికి రాత్రి సమయాల్లో రైల్వే పోలీసులు కోచ్‭లపై ఒక కన్నేసి ఉంచుతారు. అయితే గురువారం రాత్రి ఏం జరిగిందనే విషయమై తెలియాల్సి ఉందని అన్నారు.

Delhi airport: పైలట్ల సమ్మెతో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికుల అవస్థలు.. ఆదుకోండి అంటూ వినతి