Cyber Fraudster: ఆన్‌లైన్‌లో బర్త్‌డే కేక్ ఆర్డర్ చేసి రూ.1.67లక్షలు పోగొట్టుకున్న మహిళ

ఆన్‌లైన్‌లో బర్త్ డే కేక్ బుక్ చేస్తున్నారా? జాగ్రత్త.. మీ అకౌంట్ లో డబ్బులన్నీ పోవచ్చు.! తాజాగా పూణెకు చెందిన మహిళ బర్త్ డే కేక్ కోసం ఆర్డర్ చేసి రూ. 1.67 లక్షలు పోగొట్టుకుంది.

Cyber Fraudster: ఆన్‌లైన్‌లో బర్త్‌డే కేక్ ఆర్డర్ చేసి రూ.1.67లక్షలు పోగొట్టుకున్న మహిళ

Cyber Fraudster: ఆన్‌లైన్‌లో బర్త్ డే కేక్ బుక్ చేస్తున్నారా? జాగ్రత్త.. మీ అకౌంట్ లో డబ్బులన్నీ పోవచ్చు.! తాజాగా పూణెకు చెందిన మహిళ బర్త్ డే కేక్ కోసం ఆర్డర్ చేసి రూ. 1.67 లక్షలు పోగొట్టుకుంది. మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భోసారి ఎంఐడీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోషికి చెందిన ఓ మహిళ తన బర్త్ డే కేక్ కోసం ఆన్ లైన్ లో వెతికింది. ఓ కేక్ షాప్ నెంబర్ ను తెలుసుకొని రూ. 400 విలువైన కేక్ ను ఆర్డర్ చేసింది.

Cyber Fraud : హైదరాబాద్‌లో భారీ సైబర్ ఫ్రాడ్.. మహిళ నుంచి రూ.10లక్షలు కొట్టేశారు

షాప్ ఉద్యోగినంటూ ఓ వ్యక్తి ఆర్డర్ తీసుకున్నాడు. కొద్దిసేపటికి ఆ వ్యక్తి మహిళకు ఫోన్ చేసి రూ. 400 చెల్లించాలని, కేక్ డెలివరీ చేస్తామని చెప్పాడు. దీంతో తన బ్యాంక్ వివరాలను ఆమె కు ఇచ్చి డబ్బులు చెల్లించమని కోరాడు. చెల్లింపు విషయంలో సమస్య రావడంతో ఆ వ్యక్తి QR కోడ్‌ను షేర్ చేశాడు. మహిళ కోడ్‌ని స్కాన్ చేయగానే రూ. 2వేలు కట్ అయ్యాయి. ఇదేమని ప్రశ్నిస్తే. రూ.400 మినహా మిగిలిన డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు.

Cyber Fraud : హైదరాబాద్‌లో భారీ సైబర్‌ ఫ్రాడ్‌.. మహిళ ఖాతాలోంచి రూ.24 లక్షలు కొట్టేశారు

కొద్దిసేపటి తరువాత రూ. 10 తిరిగి మహిళ అకౌంట్ కు పంపించాడు. ఈ లోపు నిమిషాల వ్యవధిలోనే ఆరు సార్లు రూ. 1.67 లక్షలు అకౌంట్ నుంచి మాయం అయ్యాయి. మోసపోయానని గ్రహించిన మహిళ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నేరాళ్లలోని వివిధ సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.