రాంగ్ కాల్‌తో పరిచయం, యువతిపై అత్యాచారం

మహిళలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మార్పు లేదు. లైంగిక

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 07:19 AM IST
రాంగ్ కాల్‌తో పరిచయం, యువతిపై అత్యాచారం

మహిళలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మార్పు లేదు. లైంగిక

మహిళలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మార్పు లేదు. లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. రాంగ్‌ కాల్ ద్వారా యువతిని పరిచయం చేసుకున్న ఓ యువకుడు స్నేహితుల సాయంతో ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజుల పాటు లైంగిక దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

రాంగ్ కాల్ తో పరిచయం:
మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి సెల్‌ ఫోన్‌కు ఫిబ్రవరి 2న రాంగ్ కాల్ వచ్చింది. మంచిర్యాలకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు ఆమెతో మాటలు కలిపి పరిచయం పెంచుకున్నాడు. తరుచుగా ఫోన్ చేస్తూ విసిగించడం ప్రారంభించాడు. దీంతో యువతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు.. సాయికృష్ణను మందలించారు. ఫిబ్రవరి 25న యువతికి ఫోన్ చేసిన సాయికృష్ణ… నీతో మాట్లాడాలి, అంబేద్కర్ చౌరస్తాకు రా.. అని పిలిచాడు. అతడికి బుద్ధి చెప్పాలని, మరోసారి తనకు ఫోన్ చేయొద్దని హెచ్చరించాలని అనుకున్న యువతి అతడిని కలవడానికి వెళ్లింది.

అప్పటి నుంచి ఆమె కనిపించ లేదు. కంగారు పడిన తల్లిదండ్రులు.. యువతి స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికారు. ఫిబ్రవరి 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. (ఆ అనుమానంతో ప్రియురాలి నోట్లో విషం పోశాడు)

కిడ్నాప్ చేసి అత్యాచారం:
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంబేద్కర్ చౌరస్తాకు వచ్చిన యువతిని సాయికృష్ణ తన ఫ్రెండ్ శివకృష్ణతో కలిసి ఆటోలో కిడ్నాప్ చేసి రామకృష్ణాపూర్‌లోని మూతపడ్డ ఓ స్కూల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ క్యాటరింగ్ పనులు చేసే శశికాంత్‌, ఓ బాలుడు కూడా వారితో జత కలిశారు. యువతి సెల్‌పోన్‌ను లాక్కొన్న శశికాంత్ అందులో ఉన్న సిమ్‌కార్డును తన సెల్‌ఫోన్‌లో వేసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు.

రెండు రోజులు నిర్భందం:
బాధితురాలిని స్కూల్ లోనే రెండు రోజులు ఉంచిన తర్వాత ఫిబ్రవరి 27న రాత్రి మంచిర్యాలలోని శివకృష్ణ చెల్లి ఇంటికి తీసుకొచ్చారు. బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకొని బంధువులకు సమాచారం ఇచ్చింది. అప్పటికే యువతి కోసం గాలిస్తున్న పోలీసులు బాధితురాలిని రక్షించి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు మంగళవారం ఆటోలో కరీంనగర్‌ వైపు వెళ్తుండగా అరెస్ట్‌ చేశారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఒకడైన మైనర్ ని హైదరాబాద్‌లోని జువైనల్ హోమ్‌కు తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని యువతి బంధువులు డిమాండ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫోన్ లో, సోషల్ మీడియాలో పరాయి వ్యక్తులతో మాట్లాడకపోవటమే బెటర్ అని పోలీసులు చెబుతున్నారు.