సీఏఏ హింస…తలలోకి డ్రిల్లింగ్ మిషన్ దింపేశారు

  • Published By: venkaiahnaidu ,Published On : February 26, 2020 / 04:59 AM IST
సీఏఏ హింస…తలలోకి డ్రిల్లింగ్ మిషన్ దింపేశారు

దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) మద్దతిస్తున్న వారు… వ్యతిరేకిస్తున్న వారు… మంగళవారం కూడా రెచ్చిపోయారు. రెండు వర్గాలూ హింసకు దిగాయి. దుకాణాల్ని, వ్యాపార సముదాయాల్ని,వాహనాలు తగలబెట్టేయడంతో  స్థానిక వీధుల్లో ఎటుచూసినా పొగ కమ్మేసింది. ఈనేపథ్యంలో తాజాగా బయటికొచ్చిన ఓ ఎక్స్‌రే రిపోర్టు ఆందోళనకారుల వెర్రి చేష్టలను కళ్లకు కడుతోంది.  

మంగళవారం ఢిల్లీలో చోటుచేసుకున్న సీఏఏ ఘర్షణల్లో వివేక్‌ అనే 19ఏళ్ల యువకుడి తలలోకి డ్రిల్లింగ్‌ మెషీన్‌ చొచ్చుకెళ్లింది. అతడు తన దుకాణంలో పనిచేసుకుంటున్న సమయంలో అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయి. ఆందోళనకారుల దాడిలో వివేక్‌ చేతిలో ఉన్న డ్రిల్‌ మెషీన్‌ అతని తల్లోకి దిగింది. దీంతో అతన్ని వెంటనే జీటీబీ హాస్పిటల్ కి తరలించారు. ఘటనకు సంబంధించిన ఫొటోను పాయల్‌ మెహతా అనే నెటిజన్ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. దీంతో ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read More>>సీఏఏ హింసలో 20మంది మృతి…రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దన్న ఢిల్లీ బీజేపీ చీఫ్

అయితే, బాధితుడి గాయం వద్ద ఒక్క రక్తపు చుక్క కూడా కనిపించకపోవడం..ఎక్స్‌రేలో ఒక చోట ఫిబ్రవరి 25, 2020 అని ఉన్నప్పటికీ.. మరో చోట మార్చి 23, 2020 అని ఉండటంతో సందేహాలకు తావిచ్చింది. కాగా, ఢిల్లీలో అల్లరి మూకలు మారణాయుధాలతో వీధుల్లో స్వేచ్ఛగా స్వైరవిహారం చేశాయి.

ఈశాన్య ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నాం నుంచి సీఏఏ అనుకూల,వ్యతిరేక వర్గాల మధ్య కొనసాగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18కు చేరింది. ఇరు వర్గాలు రాళ్లు విసురుకుని,షాపులు, వాహనాలను తగులబెట్టేశారు. భారీగా ఆస్థినష్టం కూడా సంభవించింది. 150మందికి పైగా గాయాలపాలయ్యారు. ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలను కోల్పోగా..ఓ డీసీపీకి కూడా తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే.