Life Imprisonment Youg Man : భువనగిరి కోర్టు సంచలన తీర్పు..ప్రేమోన్మాదికి యావజ్జీవ శిక్ష, రూ.10వేల జరిమానా

యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రేమోన్మాదికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. ప్రేమను నిరాకరించిందని గోరుకంటి శ్రీకాంత్ ఓ యువతిని హత్య చేశాడు. 2017 జూన్‌ 10న ఈ హత్య జరిగింది. యువతిని కాపాడేందుకు యత్నించిన ఆమె సోదరుడిపైనా శ్రీకాంత్ కత్తితో దాడి చేశాడు.

Life Imprisonment Youg Man : భువనగిరి కోర్టు సంచలన తీర్పు..ప్రేమోన్మాదికి యావజ్జీవ శిక్ష, రూ.10వేల జరిమానా

Life Imprisonment Youg Man

Life Imprisonment Youg Man : యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రేమోన్మాదికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. ప్రేమను నిరాకరించిందని గోరుకంటి శ్రీకాంత్ ఓ యువతిని హత్య చేశాడు. 2017 జూన్‌ 10న ఈ హత్య జరిగింది. యువతిని కాపాడేందుకు యత్నించిన ఆమె సోదరుడిపైనా శ్రీకాంత్ కత్తితో దాడి చేశాడు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన మృతురాలిని అదే గ్రామానికి చెందిన గోరుకంటి శ్రీకాంత్ ప్రేమ పేరుతో వేధించేవాడు.

శ్రీకాంత్ ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. తనను ప్రేమించడంతో పాటు పెళ్లి చేసుకోవాలని కూడా శ్రీకాంత్ మృతురాలిని పలుమార్లు బెదిరించాడు. అయితే ఇందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ బాలికకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ విషయమై గ్రామ పెద్దలు కూడా శ్రీకాంత్ ను హెచ్చరించారు. బాలిక పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దని కూడ సూచించారు. కానీ, శ్రీకాంత్ వినలేదు.

Mumbai : మహిళ చేయి పట్టుకుని లాగినందుకు జైలుశిక్ష విధించిన కోర్టు

2017 జూన్ 10న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి ఇంట్లోకి ప్రవేశించి శ్రీకాంత్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో బాలికను కత్తితో పొడిచాడు. బాలిక కేకలు వేయడంతో అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలిక సోదరుడు.. శ్రీకాంత్ ను అడ్డుకోబోయాడు. అయితే శ్రీకాంత్ బాలిక సోదరుడిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఇద్దరిపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే బాలికను చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అయితే బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు శ్రీకాంత్ ను అరెస్ట్ చేశారు. అంతేకాదు నిందితుడు ఈ నేరం చేసిన విషయమై పోలీసులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో శ్రీకాంత్ ను దోషిగా నిర్ధారించి, యావజ్జీవ శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.