Rural CI Misbehaviour : మహిళా పోలీసుతో సీఐ అసభ్య ప్రవర్తన-సస్పెన్షన్ వేటు

పోలీసు స్టేషన్‌లోని   మహిళా కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించినందుకు  సీఐపై సస్పెషన్షన్ వేటు పడింది.

Rural CI Misbehaviour : మహిళా పోలీసుతో సీఐ అసభ్య ప్రవర్తన-సస్పెన్షన్ వేటు

Yadadri Ci Misbehaviour

Rural CI Misbehaviour :  పోలీసు స్టేషన్‌లోని   మహిళా కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించినందుకు  సీఐపై సస్పెషన్షన్ వేటు పడింది. రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ సబ్ ఇన్ స్పెక్టర్ సైదులు సస్పెండ్ అయిన 10 రోజులకే యాదగిరి గుట్ట రూరల్ సీఐ సస్పెండ్ అయ్యారు.

యాదాద్రి  భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట రూరల్ పోలీసు స్టేషన్ సీఐగా పని చేస్తున్న జీ.నర్సయ్య స్టేషన్‌లోని   మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు.  సదరు మహిళ నర్సయ్య ప్రవర్తనను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

Read Also : Prostitution Racket Busted In Gwalior : పాల వ్యాపారం మాటున వ్యభిచారం

దీంతో అధికారులు నర్సయ్యను విధుల  నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  నర్సయ్య   స్ధానంలో ఎల్బీనగర్   సెంట్రల్   క్రైమ్  స్టేషన్ అటాచ్‌గా   ఉన్న ఇన్‌స్పెక్టర్  బీ.నవీన్‌రెడ్డిని యాదగిరిగుట్ట రూరల్ సీఐగా   బదీలీ చేస్తూ రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు.