MP Avinash Reddy : ఆస్తుల కోసమే వివేకా హత్య.. ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వివేకా హత్యపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని తెలిపారు. హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయని పేర్కొన్నారు.

MP Avinash Reddy : ఆస్తుల కోసమే వివేకా హత్య.. ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

AVINASH

YCP MP Avinash Reddy : వివేకా హత్యపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని తెలిపారు. హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయని పేర్కొన్నారు. వివేక ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నారని పేర్కొన్నారు. ఆమెకు పుట్టిన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వివేకం సర్ ఆయన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నారని వెల్లడించారు.

ఈ క్రమంలో ఆస్థులన్నీ వారికి వెళ్లిపోతాయని.. రాజకీయ వారసులుగా వస్తారని, సునితమ్మ భర్త రాజశేఖర్ కుట్ర చేశాడని తనకు అనుమానంగా ఉందన్నారు. సీబీఐ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హత్య జరిగిన ప్రాంతంలో లెటర్ ను కూడా మాయం చేశారని చెప్పారు. తాను గుండెపోటు అని చెప్పలేదని.. ఇదంతా టీడీపీ వారు చిత్రీకరించారని స్పష్టం చేశారు. తన సోదరి సునితమ్మ హైకోర్టు, సుప్రీంకోర్టులో అనేక ఆరోపణలు చేశారని చెప్పారు.

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. వివేకా కేసులో సోమవారం వరకు అరెస్టు చేయకుండా స్టే విధించిన కోర్టు

ఏ ఒక్క రోజు తాను ఎవరి గురించి మాట్లాడలేదన్నారు. తాను కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే సీబీఐ అధికారులు సునితమ్మకు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని వైఎస్సార్ సీపీ క్యాడర్ తనను ప్రశ్నిస్తోందని అవినాష్ రెడ్డి అన్నారు. ఇక నుండి తాను మాట్లాడటం మొదలు పెడతానని చెప్పారు. గూగుల్ టేకౌట్ కాదు.. టీడీపీ టేకౌట్ అని పేర్కొన్నారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తప్పుడు ఆరోపణలతో తనను విచారిస్తున్నారని వాపోయారు. 8 మంది సాక్షులు చెప్పిన మాటలను సీబీఐ పట్టించుకోలేదన్నారు. సీబీఐ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని చెప్పారు. తప్పుడు సాక్ష్యాలతో అమాయకులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ విచారణ తప్పుదోవ పడుతోందన్నారు. తనకు న్యాయస్థానంపై నమ్మకం ఉందన్నారు. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రమ్మన్నారని తెలిపారు.