పెళ్లి పేరుతో టెక్కీని మోసం చేసిన యువతి

పెళ్లి పేరుతో టెక్కీని మోసం చేసిన యువతి

పెళ్లికాని ప్రసాద్ లే లక్ష్యంగా సమాజంలో  కొంత మంది మహిళలు యువకులను మోసం చేస్తున్నారు. పెళ్లి పేరుతో  మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పరిచయం అయిన యువతి …. ఒక టెక్కీనుంచి 16 లక్షల రూపాయలు కాజేసింది. మోస పొయానని తెలుసుకుని పోలీసులనాశ్రయించాడా యువకుడు.

బెంగుళూరు కు చెందిన అంకుర్ శర్మ అనే యువకుడు  ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా పని చేస్తున్నాడు. ఇతనికి మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా కిరారా శర్మ అనే యువతి పరిచయం అయ్యింది.  కొన్నాళ్లు ఫ్రెండ్స్ లాగా ఉండి అప్పుడు పెళ్లి చేసుకుందామని  నిర్ణయించుకుని ఇద్దరూ ఫోన్లలో మట్లాడుకోవటం మొదలెట్టారు.  ఈ సమయంలో ఆ యువతి అంకర్ శర్మ వద్దనుంచి వివిధ కారణాలు చెప్పి దాదాపు 16.82 లక్షల రూపాయలు తీసుకుంది  ఆ యువతి.

డబ్బు తీసుకున్న తర్వాత  అంకుర్ కు దూరం కాసాగింది.  ఇది గమనించిన అంకుర్ ఆయువతిని వివరంతో పాటు.. తనకివ్వాల్సిన డబ్బుల విషయం అడిగాడు. కిరారా శర్మ వివాహానికి ఒప్పుకోకపోగా డబ్బుకూడ ఇవ్వలేదు. దీంతో బాధితుడు వైట్ ఫీల్డ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

Read: రూ.400 కోట్ల స్కాం నిందితుడు, ఐఏఎస్ అధికారి ఆత్మహత్య