Suspicious Death : విశాఖ జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి

విశాఖ జిల్లా ఆనందపురంలో గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన యువతి శవమై తేలింది. సింహాచరలం సమీపంలోని భైరవ‌వాక దగ్గరలో పాడుపడిన బావిలో యువతి మృతదేహాన్ని కనుగొన్నారు.

Suspicious Death : విశాఖ జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి

Suspicious Death :  విశాఖ జిల్లా ఆనందపురంలో గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన యువతి శవమై తేలింది. సింహాచలం సమీపంలోని భైరవ‌వాక దగ్గరలో పాడుపడిన బావిలో యువతి మృతదేహాన్ని కనుగొన్నారు.

ఆనందపురం పోలీసు స్టేషన్ పరిధిలోని సొంట్యం గ్రామానికి చెందిన సిమ్మ భవాని(22) రోజూ  వెళ్తున్నట్లే    ఈ నెల 3వ తేదీన పనికోసం ఆటో డ్రైవర్ రాజు ఆటో ఎక్కివెళ్లింది. రాత్రి ఎంతసేపైనా ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు ఆనందపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Puneeth Rajkumar Family : పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్దిరెడ్డి
ఇలా ఉండగా….. సింహాచలం శివారు భైరవాక దగ్గరలోని పాడు పడిన బావిలో మహిళ మృతదేహాన్ని గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి విచారించగా రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన భవానీగా గుర్తించారు. కాగా తమ కుమార్తె హత్యకు గురైందని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.