Kottayam Murder Case : యువకుడిని కొట్టి,చంపి పోలీసు స్టేషన్ ఎదుట పడేసిన రౌడీ షీటర్

కేరళలోని కొట్టాయంలో దారుణం చోటుచేసుకుంది. మాదక ద్రవ్యాల ముఠా ఆధిపత్య పోరులో భాగంగా ఒక యువకుడిని హింసించి చంపి తీసుకువచ్చి పోలీసు స్టేషన్ ముందు పడేసి పోలీసులకు లొంగిపోయాడు ఒక నేరస్త

Kottayam Murder Case : యువకుడిని కొట్టి,చంపి పోలీసు స్టేషన్ ఎదుట పడేసిన రౌడీ షీటర్

Kottayam murder case

Kottayam Murder Case : కేరళలోని కొట్టాయంలో దారుణం చోటుచేసుకుంది. మాదక ద్రవ్యాల ముఠా ఆధిపత్య పోరులో భాగంగా ఒక యువకుడిని హింసించి చంపి తీసుకువచ్చి పోలీసు స్టేషన్ ముందు పడేసి పోలీసులకు లొంగిపోయాడు ఒక నేరస్తుడు.

వివరాల్లోకి వెళితే ….కే.జోస్ జోమోన్ అనే రౌడీ షీటర్   కొట్టాయంలో గంజాయి, డ్రగ్స్   దందా నిర్వహిస్తూ ఉంటాడు.   పాత  కక్షల  కారణంగా ముత్తంబలం లో   నివసించే షాన్ బాబు(19) అనే యువకుడిని ఆదివారం రాత్రి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడు.

బయటకు వెళ్లిన కొడుకు ఎంతసేపటికీ   తిరిగి రాకపోవటంతో  షాన్ బాబు తల్లి స్ధానిక ఈస్ట్  పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  షాన్ బాబు   కోసం నగరంలో గాలింపు చేపట్టారు. పోలీసులు గాలిస్తుండగా అర్ధరాత్రి దాటిన తర్వాత  జోమోన్,  షాన్ బాబు మృతదేహాన్ని   భుజాలపై మోసుకుని  వచ్చి పోలీసు స్టేషన్ ముందు పడేసి పోలీసులకు లొంగిపోయాడు.

ఓ వైపు పోలీసులు గాలిస్తుండగా  షాన్ బాబును కిడ్నాప్ చేసిన  జోమోన్  ఆటోలో  చిత్ర హింసలకు గురి చేస్తూ  కొట్టాయంలోని పలు ప్రాంతాల్లో తిప్పాడు.  చివరకు మరణించాడని  నిర్ధారించుకుని పోలీసు స్టేషన్ ముందుకు ఆటో  తీసుకు వచ్చి… భుజాలపై   షాన్ బాబు   మృతదేహాన్ని తీసుకు  వచ్చి పడేశాడు.

జోమోన్ పై ఇప్పటికే పలు   క్రిమినల్ కేసులు ఉన్నాయి.  గతేడాది నవంబర్ లో అతను నగర బహిష్కరణకు గురయ్యాడు.  మళ్లీ ఊళ్లోకి తిరిగి వచ్చి తన కార్యకలాపాలు ప్రారంభించే క్రమంలో ప్రత్యర్ధి వర్గం వారిపై దాడులు  చేయటం ప్రారంభించాడు.  ఆక్రమంలో షాన్ బాబును అపహరించి హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : TS Covid Update : తెలంగాణలో ఈరోజు కొత్తగా 2,447 కోవిడ్ కేసులు
షాన్‌బాబు‌ను   బలమైన ఇనుపరాడ్లు, కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు.మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కొట్టాయం ప్రభుత్వాసుపత్రికి  తరలించారు.  కాగా మరణించిన షాన్ బాబు పై ఎలాంటి కేసులు లేవని పోలీసులు తెలిపారు.  జోమొన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.