Extra Marital Affair : వివాహితతో ప్రేమ వ్యవహారం.. యువకుడ్ని దారుణంగా కొట్టి….

వివాహితతో ప్రేమ వ్యవహారం కారణంగా ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్ లో  చోటు చేసుకుంది.

Extra Marital Affair : వివాహితతో ప్రేమ వ్యవహారం.. యువకుడ్ని దారుణంగా కొట్టి….

Man Beaten To Death

Extra Marital Affair : వివాహితతో ప్రేమ వ్యవహారం కారణంగా ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్ లో  చోటు చేసుకుంది. యువకుడిని చితకబాదిన మహిళ బంధువులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయచటంతో స్ధానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.

రాజస్థాన్ లోని హనుమాన్‌ఘడ్ ప్రేమ్‌పురా ప్రాంతానికి చెందిన జగదీష్ మేఘ్వాల్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మహిళతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈవిషయం ఆమె భర్తకు తెలిసి పోయింది. అయినా భర్త ఎవరినీ ఏమీ అనకుండా జగదీష్‌పై మనసులో పగ పెంచుకున్నాడు. అక్టోబర్ 7గురువారం నాడు జగదీష్ ఇంటి నుంచి బయటకు బయలు దేరాడు. ఇది గమనించిన మహిళ భర్త తన మిత్రులతో కలిసి జగదీష్‌ని అనుసరించారు.

Also Read : Green Channel : అవయవదానం : మదురై నుంచి చెన్నైకి 76 నిమిషాల్లో ఊపిరి తిత్తులు

కొంతదూరం వెళ్ళాక జగదీష్ ను కిడ్నాప్ చేసి ఊరి చివర నిర్జన ప్రదేశానికి తీసుకు వెళ్లారు. అక్కడ దాదాపు ఆరుగురు వ్యక్తులు అతడ్ని కర్రలతో దారుణంగా చితక బాదారు. ఒకరు మోకాలుతో మెడపై నొక్కి పెట్టి ఉంచగా మిగిలిన వారు విడతల వారీగా కర్రలతో విచక్షణా రహితంగా చితక బాదారు. మధ్య మధ్యలో మంచినీళ్లు ఇస్తూ చావ గొట్టారు. వారు కొట్టిన దెబ్బలకు జగదీష్ ప్రాణం వదిలాడు. అనంతరం జగదీష్ శవాన్ని తీసుకువచ్చి అతని ఇంటిముందు పడేసి అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

జగదీష్ ను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులందరినీ అరెస్ట్ చేసేంతవరకు ఆందోళన చేపడతామని… అప్పటి వరకు శవానికి దహన సంస్కారాలు చేయమని చెప్పి.. మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ… ఇంతవరకునిందితులను పట్టుకోలేనందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్రంగా విరుచుకు పడ్డారు.