Young Man Suicide : బుల్లెట్ బైకు, ఫోను కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లో విషాదం నెలకొంది. బుల్లెట్ బైకు, ఫోను కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Young Man Suicide : ఉత్తరప్రదేశ్లో విషాదం నెలకొంది. బుల్లెట్ బైకు, ఫోను కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సుష్మా అనే మహిళ తన ఇద్దరు కుమారులు పీయూష్, పరాస్ తో కలిసి నోయిడాలోని ఓ అపార్ట్మెంట్లో జీవిస్తున్నారు. పీయూష్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, పరాస్ పక్షవాతంతో బాధపడుతున్నాడు.
18 ఏళ్ల పరాస్ ఇంటర్ ఫస్టియర్ వరకు చదివాడు. కాలికి పక్షవాతం రావడం కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. కాగా, గత కొన్ని రోజులుగా తల్లిని బుల్లెట్ బైకు, మొబైల్ ఫోను కొనివ్వాలని అడుగుతున్నాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో మనస్థాపం చెందిన పరాస్.. గదిలో ఫాన్కు ఉరేసుకున్నాడు. తల్లి పోలీసులకు సమాచారం అందించింది.
Young Woman Suicide : ఐఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే పరాస్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఏడాది క్రితం సైకిల్ కొనివ్వందుకు అలిగిన పరాస్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలిసింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.