Fake social media account : అమ్మాయిలా చాట్ చేసాడు… లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు

సోషల్ మీడియాలో ఒక యువతితో...అమ్మాయిలా చాట్ చేసిన యువకుడు కొన్నాళ్లకు తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఆమె నగ్న చిత్రాలు పంపకపోతే ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. దీంతోఆమె పోలీసులను ఆశ్రయించింది.

Fake social media account : అమ్మాయిలా  చాట్ చేసాడు…  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు

Fake Social Media Account

young man create fake social media account, harassed a woman : సోషల్ మీడియాలో కొత్త, కొత్త ఫ్రెండ్స్ పరిచయమవుతుంటారు. కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. లేటెస్ట్ అప్ డేట్స్ వస్తుంటాయి. సోషల్ మీడియా విజ్ఞానం పెంచుకోటానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది. అలా కాకుండా చాలామంది దుర్వినియోగ పరుస్తున్నారు.

సోషల్ మీడియాలో ఒక యువతితో…అమ్మాయిలా చాట్ చేసిన యువకుడు కొన్నాళ్లకు తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఆమె నగ్న చిత్రాలు పంపకపోతే ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. దీంతోఆమె పోలీసులను ఆశ్రయించింది.

కృష్ణాజిల్లా పామర్రులోని రజక బజారుకు చెందిన పామర్తి సోమేంద్ర సాయి అనే వ్యక్తి  స్ధానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సాయి ఫోన్ లో సోషల్   మీడియాను బాగా ఫాలో అవుతాడు. ఫోన్ లో అశ్లీల సైట్ లు చూడటం…..ఇన్ స్టా గ్రాం, ఫేస్ బుక్ లో ఉన్న ప్రొఫైల్స్ .. వారి స్నేహితుల జాబితాలో ఉన్న బంధువుల అమ్మాయిల ప్రోపైల్స్ చూసి ఆనందిస్తూ ఉండేవాడు.

ఆ ఫోటోలు చూసిన తర్వాత అతనికో దుర్భుద్ధి పుట్టింది. మహిళ పేరుతో ఒక ఇన్ స్టా గ్రాం ఎకౌంట్ ఓపెన్ చేశాడు. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న తమకు తెలిసిన బంధువుల అమ్మాయికి ఇన్ స్టాగ్రాం నుంచి ప్రెండ్ రిక్వెస్ట్ పంపాడు.

ఆమె యాక్సెప్ట్ చేసింది. కొద్దిరోజులు ఆమెతో మహిళలాగానే చాటింగ్ చేశాడు. కొన్నాళ్లకు అతనిలోని మృగాడు నిద్ర లేచాడు. ఓ రోజు ఆమె నగ్న చిత్రాలు పంపాలని కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోయే సరికి, ఆమె ఇన్ స్టా గ్రాంకు అసభ్య మెసేజ్ లు, ఫోటోలు పంపటం మొదలెట్టాడు. అతని చర్యలకు ఆమె హతాశురాలైంది.

తనతో నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడాలని వేధించసాగాడు. నేను చెప్పినట్లు చేయకపోతే ఆమె ఫోన్ నెంబర్ అశ్లీల వెబ్ సైట్ లో పెడతానని బెదిరించాడు. దీంతో యువతి రాచకొండ పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించినపోలీసులు ఒక అమ్మాయి వేధించిందని భావించారు. ఆ తర్వాత సాంకేతికంగా ఆ ఎకౌంట్ ను ట్రేస్ చేయగా నిందితుడిని ఆమె బంధువు సోమేంద్రగా గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేశారు.