Bhairavakona : కార్తీకమాసం స్నానాల్లో యువకుడు గల్లంతు

ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భైరవకోనలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది.

Bhairavakona : కార్తీకమాసం స్నానాల్లో యువకుడు గల్లంతు

Bhairavakona man missing

Bhairavakona :  ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భైరవకోనలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. సిఎస్ పురం మండలం భైరవకోన పుణ్య క్షేత్రంలో జలపాతంలో స్నానానికి వెళ్ళిన ఓ యువకుడు గల్లంతయ్యాడు.  కార్తీకమాసం ఆఖరి సోమవారం కావటంతో భైరవకోనకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.

జలపాతంలో పై నుండి దుముకుతున్న నీటి ప్రవాహనికి స్నానానికి దిగిన యువకుడు గల్లంతయ్యాడు.  ఆ యువకుడు త్రిముఖ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన  అనంతరం జలపాతంలో స్నానం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం తెలుసుకుని సంఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.