వితంతువుతో వివాహేతర సంబంధం-దూరం పెట్టటంతో హత్య

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం నల్లబల్లి గ్రామ శివారులోని యాటగానిగుట్టలో పోతుదొడ్డి గ్రామానికి చెందిన రాధమ్మ (30) అనే వితంతువు దారుణ హత్యకు గురైంది. ఆమను హత్య చేసిన వారం రోజులకు ఈ విషయం బయటపడింది. యాటగాని గుట్ట వద్ద నుంచి దుర్వాసన వస్తోందని స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఈ దారుణం వెలుగు చూసింది.

వితంతువుతో వివాహేతర సంబంధం-దూరం పెట్టటంతో హత్య

young widow brutally murdered in kurnool district : విధి వంచితురాలైన వింతతు తన ఊళ్లోకిరాణా కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఒంటరి మహిళ అయ్యేసరికి పలువురు మృగాళ్ల కళ్లు ఆమెమీద పడ్డాయి. అందులో ఒకడు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బంధువులకు తెలిసిమందలించే సరికి అతడ్ని దూరం పెట్టింది ఆవితంతుమహిళ. దీంతో కోపం పెంచుకున్నఅతడుఆమెను హత్య చేసిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం నల్లబల్లి గ్రామ శివారులోని యాటగానిగుట్టలో పోతుదొడ్డి గ్రామానికి చెందిన రాధమ్మ (30) అనే వితంతువు దారుణ హత్యకు గురైంది. ఆమను హత్య చేసిన వారం రోజులకు ఈ విషయం బయటపడింది. యాటగాని గుట్ట వద్ద నుంచి దుర్వాసన వస్తోందని స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఈ దారుణం వెలుగు చూసింది.

పోతుదొడ్డి గ్రామానికి చెందిన రాధమ్మకు. 15 ఏళ్ల క్రితం బోయవాండ్లపల్లె గ్రామానికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. వీరికి ఒక కూతురు కొడుకు పుట్టారు. అనారోగ్యంతో ఆమె భర్త రామ్మోహనరావు మూడేళ్ల క్రితం కన్నుమూశాడు. దీంతో పిల్లల్ని తీసుకుని పుట్టింటికి చేరిన రాధమ్మ స్వగ్రామంలోనే చిన్న కిరాణా కొట్టుపెట్టుకుని, పిల్లలతో జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలో ఆమెకు గ్రామానికి చెందిన ధనంజయ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. క్రమేపి ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లకు వీళ్ల అక్రమ సంబంధం విషయం రాధమ్మకుటుంబ సభ్యులకు తెలిసిపోయి ఆమెను మందలిచారు. అప్పటినుంచి ఆమె ధనంజయ ను దూరం పెట్టింది.

దీన్నిజీర్ణించుకోలేని ధనుంజయ నల్లబల్లి గ్రామానికి చెందిన తన మిత్రుడు రంగస్వామితో కలిసి ఆమెను అంత మొందించాలనుకున్నాడు. వాళ్లిద్దరూ కలిసి మాట్లాడదాం రమ్మనమని చెప్పి ఆమెను ఊరు చివర యాటగాని గుట్టవద్దకు తీసుకువెళ్లారు.

అక్కడ ఆమెను రాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అనంతరం శవాన్ని కనిపించకుండా చేసేందుకు గుట్టలోని రాళ్లమధ్య శవాన్ని పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారం రోజుల తర్వాత గుట్టనుంచి దుర్వాసన రావటంతో స్ధానికులు సోమవారం మార్చి8వ తేదీ పోలీసులకు సమాచారం ఇచ్చారు, యాటగాని గుట్ట వద్దకు వచ్చిన పోలీసలు గాలించి రాధమ్మ శవాన్ని గుర్తించి బయటకు తీసి పంచనామా నిర్వహించారు.

కాగా…. షాపులోకి సరుకులు తీసుకు వస్తానని మార్చి 3వ తేదీన ప్యాపిలికి వెళ్ళిన రాధమ్మ తిరిగి రాత్రి ఇంటికి తిరిగి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా గాలించారు. ఎక్కడా ఆమె ఆచూకి లభించకపోయేసరికి మార్చి 5న ఆమె సోదరుడు ప్యాపిలి పోలీస్ స్టేషన్ లో తన చెల్లి కనిపించటం లేదని ఫిర్యాదు చేశాడు.

ఈక్రమంలో సోమవారం రాధమ్మ మృతదేహాం యాటగాని గుట్ట వద్ద లభించటంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ధనుంజయ, అతనిస్నేహితుడు రంగస్వామి తన సోదరిని హత్య చేసినట్లు రాధమ్మ సొదరుడు సుంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు, కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.