Delhi Metro : మెట్రో స్టేషన్‌లో యువతిపై లైంగిక వేధింపులు-పట్టించుకోని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న యువతిపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తూ... లైంగికంగా వేధించాడు.

Delhi Metro : మెట్రో స్టేషన్‌లో యువతిపై లైంగిక వేధింపులు-పట్టించుకోని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు

Delhi Metro Molestation

Delhi Metro : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న యువతిపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తూ… లైంగికంగా వేధించాడు. స్టేషన్ లో ఉన్న సెక్యూరిటీకి చెప్పినా, సమీపంలోని మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఆమె ట్విట్టర్ ద్వారా ఢిల్లీ మెట్రో కార్పోరేషన్ కు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొలెట్టారు.

ఢిల్లీలోని జోర్ బాగ్ మెట్రో స్టేషన్ లో బాధిత యువతి ఇటీవల రైలు ఎక్కింది. అదే రైలులో ప్రయాణిస్తున్న ఒక యువకుడు ఆమెను ఒక అడ్రస్ గురించి అడిగాడు. ఆమె అతనికి అడ్రస్ చెప్పింది. అనంతరం ఆమె దిగాల్సిన స్టేషన్ వస్తే ఆమె దిగింది. తర్వాత తను ఎక్కాల్సిన మరో రైలు కోసం ఆమె స్టేషన్ లో ఎదురు చూస్తూ.. స్టేషన్ లోని బెంచి మీద కూర్చుంది.

ఇంతలో రైలులో అడ్రస్ అడిగిన యువకుడు మళ్లీ వచ్చి ఆమెను అదే అడ్రస్  కొంచెం క్లియర్ గా చెప్పమని మళ్లీ అడిగాడు. ఈసారి తన శరీర  భాగాలను ఆమెకు తాకిస్తూ దారుణంగా ప్రవర్తించాడు. అతని చేష్టలకు షాక్ తిన్న యువతి స్టేషన్ లో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది.  అతను పట్టించుకోకుండా పైన ఉన్న స్టేషన్ లో ఫిర్యాదు చేయమన్నాడు.

దీంతో ఆమె మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజి ద్వారా నిందితుడిని కూడా గుర్తించి పోలీసులకు వివరించింది.  అయినా పోలీసులు కేసు నమోదు చేసేందుకు అంగీకరించలేదు. ఈ విషయాన్ని పెద్దది  చేయవద్దని ఆమెకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో విసుగు చెందిన బాధితురాలు తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్టిట్టర్ ద్వారా ఢిల్లీ మెట్రరైలు కార్పోరేషన్ కు ఫిర్యాదు చేసింది.

వారు వెంటనే స్పందించారు. జరిగిన ఘటనపై తగు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సీసీటీవీ ఫుటేజి ద్వారా నిందుతుడిని గుర్తించామని… పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఈఘటనపై సీరియస్‌ అయిన ఢిల్లీ మహిళా కమిషన్‌.. కేసు సుమోటోగా స్వీకరిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read : PM Modi : జూలై 4న భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన