Social Media : సోషల్ మీడియాలో మోసాలు….కిలాడీ లేడీ అరెస్ట్

సోషల్ మీడియా ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి, అలియాస్ ధరణి రెడ్డిని నల్గోండ పోలీసులు అరెస్ట్ చేశారు.

Social Media : సోషల్ మీడియాలో మోసాలు….కిలాడీ లేడీ అరెస్ట్

Social Media

Social Media : సోషల్ మీడియా ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి, అలియాస్ ధరణి రెడ్డిని నల్గోండ పోలీసులు అరెస్ట్ చేశారు. మహేశ్వరి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. అందులో పరిచయం అయ్యే యువకులకు వలపు వల విసురుతూ వారి వద్ద నుంచి డబ్బులు దండుకోవటం మొదలెట్టింది.

వీటితోపాటు పెళ్లి సంబంధాలు కుదురుస్తానని చెప్పి పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసింది. ఈ క్రమంలో ఆమెకు హైదరాబాద్ కొంపల్లికి చెందిన వెంకటేశ్ తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యింది. అతనితో అభ్యంతరకర రీతిలో వీడియో చాటింగ్ చేసి మూడు నెలలుగా అతడిని బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. మరో వైపు కొంతమంది యువతులకు పెళ్లిసంబంధాలు చూపిస్తానని చెప్పి వారి వద్ద నుంచి ఫీజు రూపంలో డబ్బు రాబట్టి మోసాలకు పాల్పడినట్లు నల్గోండ పోలీసులు తెలిపారు.

పెళ్లి సంబంధాల పేరుతో అబ్బాయిల ఫోటోలు పేర్లు మార్చి.. వాళ్ల ప్రోఫైల్ మార్చి చెపుతూ మోసాలకుపాల్పడిందని పోలీసులు హెచ్చరించారు. పలువురు బాధితుల వద్ద నుంచి ఆమె ఇటీవలల రూ. 11.70 లక్షలూ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పదుల సంఖ్యలో ఆమె బాధితులు ఉన్నారు.

వారంతా పోలీసులను ఆశ్రయించటంతో నల్గొండ వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న మహేశ్వరిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మహేశ్వరిపై కూకట్ పల్లి, ఘట్ కేసర్, ఖమ్మం, సత్తుపల్లి, వేంసూరు పోలీసు స్టేషన్లతో పాటు కరీంనగర్, షీ టీం, గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లలో పలు కేసులు నమోదైనట్లు నల్గోండ ఎస్పీ తెలిపారు.