Love Cheating : ప్రేమ పేరుతో మోసం-యువతి ఆత్మహత్యాయత్నం

వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడి ఇంటి వద్ద అతని ప్రియురాలు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Love Cheating : ప్రేమ పేరుతో మోసం-యువతి ఆత్మహత్యాయత్నం

Love Cheating

Love Cheating :  వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడి ఇంటి వద్ద అతని ప్రియురాలు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నవీన్ హైదరాబాద్ లోని ఒక సూపర్ మార్కెట్ లో పని చేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న ఈసీఐఎల్‌కు చెందిన యువతిని నవీన్ ప్రేమించాడు. వీరిరువురికి ఆరు నెలల క్రితం పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్ళి చేసుకుంటానని చెప్పిన నవీన్ తర్వాత మొహం చాటేశాడు.

వారం రోజుల క్రితం యువతి ఇంట్లో చెప్పకుండా యువకుడి ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటానని మొండికేయగా…గ్రామ సర్పంచ్, కొందరు పెద్దలు పంచాయతీ పెట్టారు. ఇంట్లో పెద్దవారిని తీసుకుని వస్తే మాట్లాడి ఒప్పిస్తామని యువతికి నచ్చజెప్పి తిరిగి ఇంటికి పంపిచారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు యువతితో కలిసి యువకుడి ఇంటికి వచ్చారు.  10 లక్షల రూపాయల కట్నం, పది తులాల బంగారం ఇస్తే గాని పెళ్ళి చేసుకునేది లేదంటూ యువకుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆవేశానికి లోనైన యువతి అక్కడే ఉన్న బ్లేడ్‌తో గొంతు కోసుకుంది.

యువతిని వెంటనే పరిగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చి ప్రథమ చికిత్స అందజేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెళ్ళి చేసుకోమని అడిగితే.. కట్నం పేరుతో మోహం చాటేశాడని యువతి బంధువులు ఆరోపించారు. దీంతోనే యువతి మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని వారు ఆరోపిస్తున్నారు.

Also Read : Borewell Boy : బోరు బావిలో పడ్డ బాలుడు-సాహసం చేసి కాపాడిన యువకుడు