పుట్టిన రోజే చివరి రోజు : రోడ్డుపై యువతి మృతదేహం.. హత్యాచారం అనుమానాలు

పుట్టిన రోజే చివరి రోజు : రోడ్డుపై యువతి మృతదేహం.. హత్యాచారం అనుమానాలు

హన్మకొండలో దారుణం జరిగింది. పుట్టిన రోజే ఆ యువతి జీవితంలో ఆఖరి రోజు అయ్యింది. దేవుడి దగ్గరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆ యువతి.. తిరిగి రాని లోకాలకు

పుట్టిన రోజే చివరి రోజు : రోడ్డుపై యువతి మృతదేహం.. హత్యాచారం అనుమానాలు

హన్మకొండలో దారుణం జరిగింది. పుట్టిన రోజే ఆ యువతి జీవితంలో ఆఖరి రోజు అయ్యింది. దేవుడి దగ్గరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆ యువతి.. తిరిగి రాని లోకాలకు

హన్మకొండలో దారుణం జరిగింది. పుట్టిన రోజే ఆ యువతి జీవితంలో ఆఖరి రోజు అయ్యింది. దేవుడి దగ్గరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆ యువతి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. 19 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన హన్మకొండలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం(నవంబర్ 27,2019) రాత్రి 11 గంటల సమయంలో హంటర్‌ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్‌ సమీపంలో ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె గురించి ఆరా తీశారు. యవతిని దీన్ దయాళ్ నగర్ కు చెందిన మానసగా గుర్తించారు. ఈ విషయాన్ని మానస తల్లిదండ్రులకు పోలీసులు తెలిపారు. అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు విగతజీవిగా పడి ఉన్న మానసను చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. పుట్టిన రోజే .. నీకు ఆఖరి రోజైందా అంటూ రోదించారు. 

కాగా, యువతి శవం పడి ఉన్న తీరుపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని సందేహిస్తున్నారు. మృతదేహానికి కొద్ది దూరంలో బీరు సీసాలు, అమ్మాయి చెప్పులు లభించాయి. ఆ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. గుర్తు తెలియని వ్యక్తులు యువతిని కిడ్నాప్‌ చేసి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారం చేసి చంపేశారా? లేకి మానసకు తెలిసిన వారే ఈ పని చేశారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దీనదయాళ్‌నగర్‌లో నివాసం ఉండే మల్లయ్య, స్వరూప దంపతుల కూతురే మానస. బుధవారం(నవంబర్ 27,2019) మానస పుట్టిన రోజు. దీంతో భద్రకాళి గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఉంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మానస కోసం గాలిస్తుండగా.. ఇంతలో ఊహించని వార్త అందింది. మానస చనిపోయిందని తెలిసి తల్లిదండ్రులు షాక్ తిన్నారు.

×