వీళ్లు మారరు : ప్రాణం మీదకి తెచ్చిన సెల్ఫీ పిచ్చి

సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. సెల్పీ మోజులో ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాల్లో విషాదం

  • Published By: veegamteam ,Published On : November 16, 2019 / 02:31 AM IST
వీళ్లు మారరు : ప్రాణం మీదకి తెచ్చిన సెల్ఫీ పిచ్చి

సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. సెల్పీ మోజులో ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాల్లో విషాదం

సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. సెల్పీ మోజులో ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంత జరుగుతున్నా మార్పు రావడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. సెల్ఫీ మోజు యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు జయరాజ్.

భీంగల్‌లో లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి జాతర జరుగుతోంది. ఈ జాతరలో ఏర్పాటు చేసిన బ్రేక్ డ్యాన్స్ మెషీన్ ఎక్కాడు జయరాజ్. ఆ ఉత్సాహంలో సరదాగా ఓ సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. వెంటనే జేబులో నుంచి మొబైల్ బయటకు తీశాడు. బ్రేక్ డ్యాన్స్ మిషన్ నడుస్తుండగానే సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే మెషీన్ అతివేగంగా తిరుగుతున్న సమయంలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడంతో పట్టుతప్పి కింద పడిపోయాడు. 

కిందకి జారిన జయరాజ్ రెండు మిషన్ల మధ్య ఇరుక్కుపోయాడు. వెంటనే గమనించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. మిషన్‌ను ఆపి అతడిని జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో జయరాజ్‌కు తీవ్ర గాయాలు  అయ్యాయి. నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనను కళ్లారా చూసిన వారు షాక్ కి గురయ్యారు. అప్పటివరకు సందడిగా ఉన్న జాతరలో ఒక్కసారిగా కలకలం రేగింది. సెల్ఫీ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీల జోలికి వెళ్లకపోవడమే మంచిదంటున్నారు.