Beaten To Death : అమానుషం.. అమ్మాయితో చాటింగ్ చేశాడని దారుణ హత్య
అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. బెంగళూరులో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.

Beaten To Death : బెంగళూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. మృతుడి పేరు గోవిందరాజు. కాలేజీలో చదువుతున్నాడు. గోవిందరాజు తన కాలేజీ ఫ్రెండ్ అయిన అమ్మాయితో చాటింగ్ చేసేవాడు. అయితే, ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది.
ఓ రోజు యువతి తన ఫోన్ ను ఇంట్లోనే మర్చిపోయింది. ఆ సమయంలో గోవిందరాజుతో ఆమె చేసిన చాటింగ్, వీడియోలను అమ్మాయి కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో మాట్లాడాలని చెప్పి గోవిందరాజుని పిలిపించారు. అంద్రహల్లి అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. అనిల్, లోహిత్, భరత్, కిషోర్ అనే నలుగురు వ్యక్తులు కర్రలతో గోవిందరాజుపై దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో గోవింద రాజు చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. గోవిందరాజును దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
గోవిందరాజు వయసు 20ఏళ్లు. తన కాలేజీలోని అమ్మాయితో అతడు చాటింగ్ చేసేవాడు. అయితే, ఇది అమ్మాయి కుటుంబసభ్యులకు నచ్చలేదు. గోవిందరాజుని మర్డర్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గోవిందరాజుని బయటకు రావాలని అమ్మాయి బంధువు అనిల్ పిలిచాడు. బైక్ పై తీసుకెళ్లాడు. ఆ తర్వాత మరో ముగ్గురు వ్యక్తులు అనిల్ తో కలిశారు. నలుగురూ కలిసి కర్రలతో గోవిందరాజుని విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ గోవిందరాజు మృతి చెందాడు. ఆ తర్వాత నలుగురు నిందితులు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. గోవిందరాజు డెడ్ బాడీని లోహిత్ కారులో పెట్టారు. అక్కడి నుంచి చార్ ముడి ఘాట్ ప్రాంతానికి తీసుకెళ్లి పడేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గోవిందరాజు కనిపించకపోయే సరికి కంగారుపడిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో షాకింగ్ నిజం తెలిసింది. గోవిందరాజు దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. నిందితులపై పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించారు. అంతే, నిజం బయటకు వచ్చింది. గోవిందరాజుని తామే హత్య చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.