Bapatla : దారుణం : 50 ఏళ్ల మహిళపై 25 ఏళ్ళ యువకుడి అత్యాచారం

బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 50 ఏళ్ల మహిళపై 25 సంవత్సరాల యువకుడు అత్యాచారయత్నం చేశాడు.

Bapatla : దారుణం : 50 ఏళ్ల మహిళపై 25 ఏళ్ళ యువకుడి అత్యాచారం

Bapatla :  బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 50 ఏళ్ల మహిళపై 25 సంవత్సరాల యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయటంతో పరారయ్యాడు. బాపట్ల జిల్లా ఇందిరా నగర్ కాలనీలో నివసించే మహిళ(50) పై అదే కాలనీకి చెందిన పిల్లి నాగేంద్రబాబు(25) అనే యువకుడు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటిలోకి ప్రవేశించాడు.

మహిళకు కత్తి చూపించి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. కేకలు విని ఇరుగు పొరుగువారు ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో నాగేంద్రబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళపై  అత్యాచారానికి ప్రయత్నించినప్పుడు పెనుగులాటలో ఆమెకు కత్తిగాట్లు అయ్యాయి. దీంతో కాలనీ వాసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితురాలి వద్ద నుంచి వివరాలు సేకరించి నిందితుడు నాగేంద్రబాబుపై కేసు నమోదు చేశారు.

నాగేంద్రబాబు అలియాస్ మోజెస్ అనేక నేరాలలో నిందితుడని… ఇప్పటికే అతనిపై కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్ననిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.. గతంలో ఓ ప్రాంతంలో బస్సు కోసం వేచివున్న మహిళను సైతం ఆటోలో ఎక్కించుకొని అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీస్ లు చెబుతున్నారు.

Also Read : Actress Mira Mithun : నటి మీరామిథున్‌పై మరోసారి అరెస్ట్ వారంట్ జారీ