YSRCP Sarpanch Murder : కడప జిల్లాలో వైసీపీ సర్పంచ్‌ను నరికి చంపిన ప్రత్యర్ధులు

కడప జిల్లా లింగాల మండలం కోమన్నూతల గ్రామ సర్పంచ్ ను ప్రత్యర్ధులు దారణంగా హత్య చేశారు.

10TV Telugu News

YSRCP Sarpanch Murder : కడప జిల్లా లింగాల మండలం కోమన్నూతల గ్రామ సర్పంచ్ ను ప్రత్యర్ధులు దారణంగా హత్య చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన గ్రామ సర్పంచ్ చిన్న మునియప్ప(50)ను ప్రత్యర్ధులు నరికి చంపారు. సర్పంచ్ ల శిక్షణా తరగతులకు హాజరయ్యేందుకు మునెప్ప

పులివెందులకు వెళ్లారు. తరగతులకు హాజరై తిరిగి కోమన్నూతల గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రత్యర్ధులు దారికాచి వేటకొడవళ్ళతో నరికి చంపారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో జరిగిన వివాదం వల్లే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 150 ఓట్ల మెజార్టీతో మునెప్ప సర్పంచ్ గా గెలుపొందారు. ఆధిపత్య పోరులోనే  ఈ హత్య జరిగినట్లు భావించిన పోలీసులు కేసునమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.

10TV Telugu News