లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

యస్ బ్యాంక్ ఫౌండర్ కూతురు,భార్యపై సీబీఐ కేసు నమోదు

Published

on

Crisis-Hit Yes Bank Founder Rana Kapoor's Wife, Daughters Charged By CBI

యస్ బ్యాంకు సంక్షోభంకి సంబంధించి ఆ బ్యాంకు వ్యవస్థాపకుడైన రాణా కపూర్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఆదివారం సీబీఐ చార్జ్ షీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసులో సీబీఐ సోమవారం(మార్చి-9,2020)రాణాకపూర్ భార్య, కూతురు పేర్లను కూడా చేర్చింది. యస్ బ్యాంక్ సంక్షోభంలో వారి హస్తం కూడా ఉన్నట్లు సీబీఐ అనుమానిస్తోంది. రాణా కపూర్ ఫ్యామిలీకి చెందిన 7 ప్రాంతాల్లోని నావాసాల్లో సీబీఐ ఇవాళ సోదాలు నిర్వహించింది.

యస్ బ్యాంకు సంక్షోభంపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో రాణా కపూర్ మొత్తం కుటుంబం ఈ కేసులో చిక్కుకోవడం కొత్త మలుపును తీసుకుంది. రాణా కపూర్‌తో పాటు ఆయన కుటుంబానికి లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ సమయంలో ఆదివారం మధ్యాహ్నాం ముంబై ఎయిరో పోర్ట్ లో లండన్ ఫ్లైట్ ఎక్కబోతున్న  రాణా కపూర్ కూతరు రోషిణి కపూర్‌ని అధికాారులుయ అడ్డుకున్నారు.

ఆదివారం రాణాకపూర్ ని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబై కోర్టు ఆదేశాల మేరకు బుధవారం(మార్చి-11,2020) వరకు కస్టడీలో ఉంచనుంది. యస్ బ్యాంక్ సంక్షోభం అనంతరం ఆదివారొం ముంబైలోని రాణా కపూర్ ఇల్లును, ఢిల్లీలోని ఆయన కూతురు రోషిణి కపూర్ ఇంటిలోను సోదాలు చేసిన అనంతరం మనీ లాండరింగ్ ఆరోపణలతో రాణా కపూర్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

యస్ బ్యాంక్… దేవాన్ హౌసింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క రూ .3,700 కోట్ల విలువైన డిబెంచర్లను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ రాణా కపూర్ ముగ్గురు కుమార్తెలు రోషిణీ కపూర్, రాఖీ కపూర్,రాధా కపూర్ లకు చెందిన డోయిట్ అనే సంస్థకు రూ .600 కోట్ల రుణం మంజూరు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయవాది ఆదివారం కోర్టులో ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యస్ బ్యాంకుపై మారటోరియం విధించి, నగదు ఉపసంహరణపై రూ .50 వేల పరిమితిని విధించిన తరువాత యెస్ బ్యాంక్‌పై ప్రజల ఆగ్రహం కారణంగా తన క్లయింట్‌ను “బలిపశువు” గా మార్చారని కపూర్ న్యాయవాది జైన్ ష్రాఫ్ కోర్టులో వాదించారు.

See Also | పెంపుడు కుక్కల కోసం వ్యక్తి ఓవర్ యాక్షన్..ప్రభుత్వానికి రూ.7లక్షలు ఫైన్