Croatian tennis player Borna Coric has tested positive for coronavirus a day after Grigor Dimitrov

క్రీడా రంగంలో కరోనా : నిన్న క్రికేట్..నేడు టెన్నిస్..రేపు ?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎక్కడికైనా వెళుతా..ఎవరికైనా అంటిస్తా..అంటోంది కరోనా రాకాసి. చైనా దేశం నుంచి వచ్చిన ఈ భూతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి సెలబ్రెటీ, ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. చాలా మంది చనిపోయిన సంగతి తెలిసిందే. క్రీడా రంగంలో కూడా విస్తరిస్తోంది.

వైరస్ కారణంగా నిలిచిపోయిన ఆటలు ఎప్పుడు ప్రారంభం అవుతాయా ? తాము ఎప్పుడు ఆట మొదలు పెట్టేద్దామా అని ఆలోచిస్తున్నారు క్రీడాకారులు. కానీ వారికే వైరస్ సోకడంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొన్నటి మొన్న తాజా, మాజీ క్రికేటర్లు వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా టెన్నిస్ కు పాకింది. 

టెన్నిస్ ఆటగాళ్లు బోర్నా కోరిచ్, గ్రిగోర్ దిమిత్రోవ్ లకు పాజిటివ్ అని తేలింది. ప్రపంచ ర్యాకింగ్స్ లో 19వ స్థానంలో కొనసాగుతున్న దిమిత్రోవ్ ఈ విషయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. తనకు వైరస్ సోకిందని, తనతో ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలనే ఉద్దేశ్యంతో తాను ఈ విషయాన్ని వెల్లడించడం జరిగిందన్నారు. 

దిమిత్రోవ్ గత వారం జకోవిచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన..ఆడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీ సెర్బియా అంచె పాల్గొన్నారు. అనంతరం క్రోయేషియాలో నిర్వహించిన టోర్నలో ఆడారు. ఈ మ్యాచ్ ల్లో ఇతర క్రీడాకారులు కూడా పాల్గొన్నారు.

దీంతో వారు పాల్గొన్న ఎగ్జిబిషన్ లో జరగాల్సిన మ్యాచ్ లను రద్దు చేసేశారు. దిమిత్రోవ్, కోరిచ్ లు ఓ మ్యాచ్ లో తలపడ్డారు. దిమిత్రోవ్ కు ఆదివారం, కోరిచ్ కు సోమవారం పాజిటివ్ గా తేలింది. దీంతో అందరిలోనూ కలవరం మొదలైంది. వీరి ఆటను చూడడానికి వచ్చిన వారు, నిర్వాహకులు, ప్రతినిధుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. 

Read: పెళ్లికి కావాల్సింది ప్రేమ.. దేశం కాదు: సానియా మీర్జాపై షోయబ్ మాలిక్ 

 

Related Posts