ఆలయంలోకి మెుసలి… పూజారి విజ్ఞప్తితో వెనక్కి!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

crocodile entered into the temple :  కేరళలోని ఓ ఆలయం లోపలికి మెుసలి వచ్చింది. ఆలయంలోకి వచ్చిన మెుసలిని చూసి పూజారి కంగారు పడలేదు…అటవీ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. సాధారణంగా ఎవరైనా మెుసలిని చూస్తే చాలు… వణికిపోతుంటారు. కానీ ఈయన ఏమాత్రం భయం లేకుండా ఆ మెుసలికి నమస్కారం చేసి బయటకు వెళ్లాలని విజ్ఞప్తి చేశాడు. దాంతో మెుసలి పూజారి మాట విని బయటకు వెళ్లి పోయింది. ఇలాంటి గాథలను మనం పురాణాల్లో చెబుతుంటే విని ఉంటాం. కానీ ఇది నిజం.. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది.
వివరాల్లోకి వెళ్తే… కేరళలోని కసరగడ్ జిల్లాలోని అనంతపుర ఆలయం సమీపంలో ఉన్న ఓ సరస్సులో శాఖాహార మొసలి ఉంది. దానిని బలియా అని పిలుస్తారు. ఇది చాలాకాలంగా నుంచి ఆలయానికి రక్షణగా ఉంటుంది. గుడిలోని ప్రసాదం తప్ప మరే ఆహారాన్ని అది ముట్టదు. మాంసాహారం అసలు ముట్టదు.కానీ గతంలో ఎప్పుడు ఆ మొసలి ఆలయం లోపలికి రాలేదని, ఇదే తొలిసారని ఆలయ ప్రధాన పూజారి చంద్ర ప్రకాష్ నంబీసన్ తెలిపారు. ప్రస్తుతం మెుసలి ఆలయంలోకి ప్రవేశించిన ఫోటోలు వైరల్ గా మారాయి. కానీ, కొందరు మెుసలి గర్భగుడిలోకి ప్రవేశించిదని చేసే ప్రచారంలో వాస్తవం లేదని ప్రధాన పూజారి తెలిపారు.ఈ మెుసలి ఆలయానికి కాపలాగా ఉండటం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. సుమారు 70 ఏళ్ల కిందట ఓ బ్రిటీష్ సైనికుడు ఈ సరస్సులో ఉన్న మెుసలిని చంపేశాడట. ఆ మెుసలిని చంపిన కొద్ది రోజులకే అతడు పాము కాటుకు గురై చనిపోయాడట. ఆ దైవమే అతడిని చంపిందని స్థానికులు చెబుతుంటారు.చిత్రం ఏమిటంటే ఆ మెుసలి చనిపోయిన కొద్ది రోజులకే మరో మొసలి ఆ సరస్సులోకి వచ్చి చేరింది. ఇలా కొన్నేళ్లుగా ఒక మెుసలి చనిపోయిన వెంటనే మరో మెుసలి ఆ సరస్సులోకి ప్రత్యక్షమైయ్యి ఆలయానికి కాపలాగా ఉంటున్నాయి. ప్రస్తుతం బలియా అనే మెుసలి ఆలయానికి కాపలా కాస్తోంది.

Related Tags :

Related Posts :