Home » చెన్నైపై హైదరాబాద్ విజయం
Published
4 months agoon
By
vamsiCSK vs SRH, IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2020లో 14వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ రోజు(02 అక్టోబర్ 2020) దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హైదరాబాద్ జట్టుపై 7పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ జట్టు ప్రియామ్ గార్గ్ తుఫాను అర్ధ సెంచరీ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ విఫలం అవగా.. ప్రియామ్ మరియు అభిషేక్ శర్మ 77 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని సాధించి జట్టును గౌరవనీయమైన స్కోరుకు తీసుకువచ్చారు. హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ 69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అటువంటి సమయంలో యువ ఆటగాళ్లు ప్రియం గర్గ్-అభిషేక్ శర్మలు దుమ్ములేపారు. CSK బౌలింగ్‌కు బ్యాటింగ్‌తో సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 77 పరుగులు పార్టనర్షిప్ చేశారు. అభిషేక్(31; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్‌గా అవుట్ అవగా.. ప్రియం గర్గ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివరివరకు క్రీజ్‌లో ఉన్న ప్రియం గర్గ్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌తో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అబ్దుల్ సామద్ 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఎస్ఆర్హెచ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 164 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. 165పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగి పవర్ ప్లే లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆరు ఓవర్లకు 36పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. 10ఓవర్లు ముగిసేసరికి 165 పరుగుల టార్గెట్ చేధించే క్రమంలో చెన్నై జట్టు 44పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇక 60బంతుల్లో 121పరుగులు చెయ్యవలసి వచ్చింది.
ఆ సమయంలో జడేజా, ధోని రాణించడంతో స్కోరు కాస్త ముందుకు సాగింది. సిఎస్కె ఓపెనర్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ పేలవమైన బ్యాటింగ్ చేయగా.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అతను అవుట్ అయ్యాడు. గాయం నుంచి తిరిగి వచ్చిన అంబటి రాయుడు ఈ మ్యాచ్‌లో 8 పరుగులకే వికెట్ కోల్పోయాడు. ఫాఫ్ డుప్లెసిస్ 22 పరుగులు చేసిన తర్వాత రనౌట్ అయ్యాడు. కేదార్ జాదవ్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రవీంద్ర జడేజా 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో ఈ సీజన్లో తన మొదటి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, అతను తదుపరి బంతికి అవుటయ్యాడు. ఎంఎస్ ధోని 47 పరుగులు, సామ్ కుర్రాన్ 15 పరుగులు చేశారు. ఆఖరి ఓవర్లో 28పరుగులు చెయ్యవలసి రాగా.. చెన్నై జట్టుకు 20పరుగులు లభించాయి. దీంతో చెన్నై జట్టు 7పరుగుల తేడాతో ఓడిపోయింది.