లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఏప్రిల్-30వరకు పంజాబ్ లో లాక్ డౌన్ పొడగింపు

Published

on

Curfew extended in Punjab till April 30

మంగళవారం ఒక్కరోజే 20కొత్త కరోనా కేసులు నమోదవడంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-30,2020వరకు లాక్ డౌన్ ను పొడిస్తున్నట్లు అమరీందర్ సింగ్ సర్కార్ ఇవాళ(ఏప్రిల్-8,2020)ప్రకటించింది. పంజాబ్ లో ఇప్పటివరకు మొత్తం 99కరోనా కేసులు నమోదయ్యాయి. 8కరోనా మరణాలు నమోదయ్యాయి.14మంది ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

పంజాబ్ లో ఇప్పటివరు 2,559 శాంపిల్స్ టెస్ట్ చేయగా,2,204 శాంపిల్స్ నెగిటీవ్ రాగా,256శాంపిల్స్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు ఏప్రిల్-14తో లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో… కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చేవరకూ లాక్ డౌన్ కొనసాగించాలని భావిస్తున్నట్టు ఇవాల కేంద్రం తెలిపింది. లాక్ డౌన్ ఎత్తివేయాల్సి వస్తే దశలవారీగా తొలగించే యోచనలో కేంద్రం ఉంది. లాక్ డౌన్ కొనసాగింపుపై పార్లమెంటరీ పక్ష నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టతనిచ్చారు. 

దేశం ఇప్పుడు సోషల్ ఎమర్జెన్సీతో డీల్ చేస్తుందని మోడీ అన్నారు. రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాలని కోరుతున్నాయని, ఏప్రిల్ 11న సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ఒకేసారి లాక్ డౌన్ ఎత్తివేయలేమని ప్రధాని సృష్టంగా చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే అన్నింటికన్నా ముఖ్యమని ప్రధాని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసుల నమోదు తీవ్రతను బట్టి లాక్ డౌన్  మరిన్నిరోజులు పొడిగించే అవకాశం కూడా లేకపోలేదు. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 5,194కు చేరినట్లు కేంద్రఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాత్ ఇవాళ తెలిపారు.(మాకు కరోనా రావడానికి నువ్వే కారణం, టిక్‌టాక్‌ బాయ్ కాట్ చేయాలని ఊపందుకున్న డిమాండ్)

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *