బయటకు వచ్చారో : ఏపీలో ఆ జిల్లాలో కర్ఫ్యూ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం, అధికారులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రజల నిర్లక్ష్యమే కారణమంటున్నారు.

ఏ పని లేకున్నా..అనవసరంగా బయటకు వస్తున్నారని, దీంతో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా ప్రతి ఆదివారం కర్ఫ్యూ విధించాలని అనుకున్నారు.

కరోనా కేసులు అధికమౌతున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో 2020, జులై 19వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లా అంతటా కర్ఫ్యూ అమలవుతోంది.

అత్యవసర సర్వీసులు, మెడికల్ షాపులు మినహా..అన్నీ కర్ఫ్యూ పరిధిలో వస్తాయని జల్లా కలెక్టర్ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి..ఎవరైనా రోడ్ల మీదకు వస్తే..మాత్రం ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మరోవైపు అమలాపురం రూరల్ లోని బండారులంక గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా కారణంగా Kims hospital లో చనిపోయారు. ప్రధానంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధి పోలీస్ స్టేషన్ లో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి.

అక్కడ 14 మంది పోలీసు సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. బొమ్మూరు స్టేషన్ పరిధిలో ఎస్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లతో సహా..నలుగురు కానిస్టేబుళ్లు, ధవళేశ్వరం స్టేషన్ పరిధిలో ముగ్గురు కానిస్టేబుళ్లు, కడియం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ కు కరోనా సోకినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Related Posts