Curfew should be continued at night : Letter of the Union Home Department to CSs

రాత్రి సమయంలో కర్ఫ్యూ కొనసాగించాలి : సీఎస్ లకు కేంద్ర హోంశాఖ లేఖ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాత్రి సమయంలో కర్ఫ్యూ కొనసాగించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ కొనసాగింపుపై సీఎస్‌లకు హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా  లేఖ రాశారు. రాత్రి వేళల్లో తిరగకుండా కట్టడి కోసమే నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగించాలని సూచించారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరం కొనసాగించాలని స్పష్టం చేశారు. సరకు రవాణా వాహనాలు, బస్సులు, రైళ్లు, విమాన ప్రయాణాలకు సంబంధించి గత ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై సరకు రవాణా వాహనాలను ఆపవద్దని పేర్కొన్నారు. 

మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.. కరోనా, లాక్‌డౌన్‌పై సమీక్ష
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరుకోవడంతో తాజాగా భారత్ బ్రిటన్‌ను కూడా‌ బీట్‌ చేసి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే కొద్ది రోజుల్లోనే భారత్ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 

రెండు రోజులపాటు ప్రధాని సీఎంలతో వర్చువల్‌ సమావేశాల్లో పాల్గొంటారని పీఎం కార్యాలయం శుక్రవారం తెలిపింది. జూన్ 16, 17 వ తేదీల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లు ఉంటాయని వెల్లడించింది. కరోనా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడంతోపాటు వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోసారి లాక్‌డౌన్‌ విధించాలా అన్న విషయాలపై చర్చించే అవకాశం ఉంది. 

దేశవ్యాప్తంగా 3 లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరిన ఇండియాలో లాక్ డౌన్ 1 తర్వాతే కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 2,903 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం 3 లక్షల 4వేల 19కి చేరుకుంది. ఇందులో మహారాష్ట్రదే మెజార్టీ. లక్షా ఒక వెయ్యి 141కేసులతో అత్యధిక కేసులు ఉంటే తర్వాత రెండు స్థానాల్లో తమిళనాడు 40వేల 698, ఢిల్లీ 34వేల 687ఉన్నాయి. 

Related Tags :

Related Posts :