Cute Family: Corona Time Prince Mahesh Babu Enjoy with kids

అందమైన ఫ్యామిలీ : సరదాగా పిల్లలతో ప్రిన్స్ మహేష్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మహేష్ బాబు ఎప్పుడూ..కామ్ గా కంపోజ్డ్ గా ఉంటాడు. అస్సలు ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. ఇది అందరికీ తెలిసిన మహేష్ బాబు. కానీ మహేష్ అసలు  ఇలా ఉండడని, సూపర్ స్టార్‌లో వేరే యాంగిల్స్ ఉన్నాయంటూ అసలు బండారం బయటపెడుతోంది నమ్రత. ఇలా ఎప్పుడూ బిజీగా, కామ్ గా కంపోజ్డ్ గా ఉండే మహేష్ మాత్రమే అందరికీ తెలుసు. కానీ మహేష్ లో చాలా యాంగిల్స్ ఉన్నాయి.

ఎప్పుడూ ఫ్యామిలీ మ్యాన్ గా, షూటింగ్  అయిపోగానే ఇంటికి వెళ్లి ఫ్యామిలీ మెంబర్స్ తో టైమ్ స్పెండ్ చేసే మహేష్ బాబు బండారం అంతా సోషల్ మీడియాలో సరదాగా బయటపెట్టేస్తోంది నమ్రత. అసలు మహేష్ ఇంట్లో ఉంటే ఎంత అల్లరి చేస్తాడో అంటూ ఒక్కో వీడియో సోషల్ మీడియాలో పెట్టేస్తోంది సూపర్ స్టార్ వైఫ్. పిల్లలతో చేరిపోయి మరో పిల్లాడిలా అల్లరి చేస్తున్నాడు మహేష్.

మహేష్, నమ్రత కలిసి కళ్లు ఆర్పకుండా ఉండే క్రేజీ గేమ్ లో మహేష్ ఎలా గెలిచాడో లేటెస్ట్ గా వీడియో పెట్టింది నమ్రత. పిల్లలతో కలిసి .. ఎంతగా టీజ్ చేస్తాడో కూడా లాక్ డౌన్ టైమ్ లో ఫ్యాన్స్ కోసం చూపించేసింది నమ్రత. మొన్నటికి మొన్న గౌతమ్‌తో ఐబ్లింక్ గేమ్ ఆడిన మహేష్ .. నువ్వు నా అంత హైట్ ఉన్నావా అంటూ కొడుకు గౌతమ్ తో రారా చూస్కుందాం..నీ హైట్ ఎక్కువో..నా హైట్ ఎక్కువో అంటూ ..గౌతమ్ కు ఎదురుగా వెళుతున్న వీడియోలో మహేష్ ఎంత నాటీగా ఉన్నాడో వీడియోలో బయటపెట్టేసింది నమ్రత. 

కూతురు సితార తో కలిసి ఎంతగా టైమ్ స్పెండ్ చేస్తాడో , పెయింటింగ్స్ దగ్గరనుంచి హెయిర్ మసాజ్ వరకూ, స్విమ్మింగ్ దగ్గరనుంచి సినిమాలు చూసేవరకూ లాక్ డౌన్ టైమ్ లో  ఎంతలా ఇంట్లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్  చేస్తున్నాడో సరదాగా  వీడియోలు పోస్ట్ చేసింది నమ్రత.

ఇక పిల్లలు, వైఫ్ కాకుండా ఫిట్ నెస్ విషయంలో కూడా ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో కూడా ఫ్యాన్స్ కి రివీల్ చేసింది నమ్రత. లయన్స్ డెన్ అంటూ మాంచి బీట్ సాంగ్స్ ఉన్న వీడియోస్ ని చూస్తూ..మహేష్ ఎక్సర్ సైజ్ చెయ్యడానికి వెళుతున్న వీడియోని పోస్ట్  చేసింది. ఇలా లాక్ డౌన్ టైమ్ లో మహేష్ ఏం చేస్తున్నాడో, అంతకుముందు  ఏం చేశాడో వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తోంది నమ్రత.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

The Lion’s den !! #stayhomestaysafe

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

@urstrulymahesh @gautamghattamaneni

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

Read:  బెంగళూరు వీధుల్లో హీరోయిన్ ప్రణీత సమాజ సేవ

READ  సోషల్ మీడియా సర్వే.. టాప్‌లో స్టైలిష్ స్టార్..

Related Posts