cyclone pabuk

ధాయ్ లాండ్ ను వణికిస్తున్న పబుక్ తుఫాను

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన పబుక్ తుఫాన్ థాయ్‌లాండ్ ను వణికిస్తోంది

దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన పబుక్ తుఫాన్ థాయ్‌లాండ్ ను వణికిస్తోంది. పబుక్ తుఫాను ఈనెల 5 శనివారం నాడు అండమాన్ నికోబార్‌ దీవుల్ని తాకొచ్చ‌ని  భారత వాతావరణ శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల  అండమాన్ నికోబారు దీవుల్లో శని,ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు  చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని తీర ప్రాంత‌ జిల్లాలను అధికారులు అప్రమత్తం చేసారు. 
గత మూడు దశాబ్దాల్లో ఇలాంటి భయంకరమైన తుఫాను రావడం ఇదే మొదటిసారని థాయ్ లాండ్  అధికారులు చెబుతున్నారు. తుఫాన్ థాయిలాండ్ సౌత్ తీరాన్ని తాకిన సమయంలో భారీ వృక్షాలు నేలకూలడంతో పాటు ఇళ్ళ పైకప్పులు గాల్లోకి లేచిపోయాయి. ప్రస్తుతం గాలుల వేగం కొంచెం తగ్గిందని ధాయ్ వాతావరణశాఖ అధికారులు  చెప్పారు.
థాయ్‌లాండ్ సౌత్‌లోని 15 ప్రావిన్స్‌లలో కుండపోత వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రంలో అలలు 22 అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. పట్టాని ప్రావిన్స్‌కు సమీపంలో ఉన్న తీరంలో చేప‌ల వేటకు వెళ్లే బృందంలోని ఒక వ్యక్తి  మరణించినట్లు తెలిసింది.మరొక వ్యక్తి గల్లంతయ్యాడని.. నలుగురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడంతో బోట్లన్నీ థాయ్‌లాండ్ గల్ఫ్ తీరంలో ఉన్నాయి.
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో  ముందు జాగ్రత్త చర్యగా సుమారు 6,176 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను  వస్తుందని తెలియటంతో థాయ్ లోని రెండు విమానాశ్రయాలను ముందుగానే మూసివేశారు. పలు విమానాలను రద్దు చేశారు. టూరిజం కొసం వచ్చిన టూరిస్టులు బయటకు రాలేక హోటల్ గదుల్లోనే కాలక్షేపం చేస్తున్నారు. 

Related Posts