Home » వైసీపీలోకి దగ్గుబాటి ? : మరి పురంధేశ్వరి
Published
2 years agoon
By
madhuప్రకాశం : మాజీ మంత్రి, దివంగత ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారా ? త్వరలోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారా ? అంటే అవుననే అనిపిస్తోంది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. గత కొన్ని రోజులుగా దగ్గుబాటి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరుతారనే విపరీతమైన ప్రచారం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పర్చూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ హాట్ టాపిక్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై దగ్గుబాటి…ఆయన కుమారుడు హితేశ్ చెంచురామ్ ఫొటోలుండడం చర్చనీయాంశమైంది. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి కూడా.
దగ్గుబాటి ఇంట్లో కీలక మీటింగ్…
దగ్గుబాటి ఇంట్లో జనవరి 15వ తేదీన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరితే జరిగే లాభ..నష్టాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిక విషయంపై ఎంపీ విజయసాయిరెడ్డి సంధానకర్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. జనవరి 20వ తేదీ తరువాత జగన్ సమక్షంలో పార్టీ కండువాను దగ్గుబాటి కప్పుకోనున్నారని ఆయనతో పాటు హితేశ్ చెంచురామ్ కూడా పార్టీలో చేరనున్నారని టాక్. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు దగ్గుబాటి..హితేశ్ సమాయత్తం అవుతున్నట్లు..ఇద్దరిలో ఒకరికి టికెట్ కన్ఫామ్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరి పురంధేశ్వరీ ?
దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురంధేశ్వరి బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు. మరి దగ్గుబాటి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరితే పురంధేశ్వరీ కూడా ఆయన బాటలోనే వెళుతారా ? అనేది చూడాలి. పురంధేశ్వరీ బాపట్ల..విశాఖ లోక్ సభ నియోజకవర్గాల నుండి విజయం సాధించారు. అంతేగాకుండా ఈమె యూపీఏ హాయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరీల కుమారుడు హితేశ్కి పర్చూరు అసెంబ్లీ సీటుతో పాటు..పురంధేశ్వరీకి కోరుకున్న లోక్ సభ సీటు ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు టాక్. ఒకవేళ పురంధేశ్వరీ బీజేపీలోనే ఉంటే…ఒక ఇంట్లో రెండు పార్టీల నేతలుంటారన్నమాట. రాజకీయాలు మరి..
రాజకీయాలకు దూరంగా ఉన్న దగ్గుబాటి…
ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు విషయానికి వస్తే…2004లో టీడీపీని వీడిన దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం 2004-2009లో జరిగిన ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుండి గెలుపొందారు. 2014 ఎన్నికల నుండి దగ్గుబాటి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మరి దగ్గుబాటి..ఆయన కుమారుడు హితేశ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరుతారా ? అనేది తెలియాలంటే కొద్ది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.