daily-covid-cases-could-be-2-2-5-lakh-instead-of-1-lakh-data-shows

ఇండియాలో రోజువారీ కోవిడ్ కేసులు లక్ష కాదంట.. 2.5 లక్షలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 92,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,136 మంది మృతిచెందారు. భారత్ లో 48,464,25 కరోనా కేసులు చేరాయి. మరో 79,722 మంది మృతిచెందారు. భారత్ లో రికవరీ రేటు 78 శాతం, మరణాల రేటు 1.64 శాతం నమోదైంది. దేశంలో కరోనా తీవ్రత చాలా ఎక్కువ ఉందని, కరోనా లెక్కల్లో చాలా తక్కువ అంచనా వేస్తున్నారనే అభిప్రాయం ఉంది.



ఇప్పటివరకూ భారతదేశంలో రిలీజ్ చేయని అనధికారక డేటా ఆధారంగా ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటివరకూ ప్రకటించిన కోవిడ్ అధికారిక డేటాలో రోజుకు 95వేల నుంచి 1 లక్ష మాత్రమే.. కానీ, వాస్తవానికి ఇండియాలో రోజువారీ కరోనా కేసులు లక్ష కాదంట.. రెండన్నర లక్షలు ఉండొచ్చునని నివేదిక వెల్లడించింది. అనధికారక డేటాలో దీనికంటే రెండు రెట్లు కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంటే.. రోజుకు 2 లక్షల నుంచి 2 లక్షల 50వేల వరకు కరోనా కేసులు వస్తున్నట్టు తేలింది.



రోజువారీ కొత్త కరోనా కేసుల్లో ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉందని నివేదిక ధృవీకరించింది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులతో కరోనా కేసుల పెరిగినట్టు కనిపించినప్పటికీ కరోనా తీవ్రతపై తక్కువ అంచనా అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీనికి కారణం.. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులే.. కరోనా పాజిటివ్ వచ్చిన చాలామందిలో ఎక్కువ శాతం ఈ టెస్టుల్లో నెగటివ్ అని తేలడమే.. లిటరేచర్, PCR టెస్టుల ప్రకారం.. ఈ టెస్టుల ద్వారా గుర్తించిన కరోనా కేసలు కంటే వాస్తవంగా అంతకంటే డబుల్ ఉంటాయని వెల్లడించింది. ఢిల్లీ, మహారాష్ట్రలో పీసీఆర్ టెస్టింగ్ ద్వారా నిర్వహించిన అధికారి డేటాతో తేటతెల్లమైంది.



ఈ రెండు టెస్టుల మధ్య వ్యత్యాసం అంతర్జాతీయ ప్రమాణాలకు ఒకేలా ఉండటమే కారణం.. ఇటీవలే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన అధికారిక డేటాను పరిశీలిస్తే.. ర్యాపిడ్ యాంటిజెన్, PCR టెస్టులు రెండింటిలోనూ పాజిటివ్ రేటు దాదాపు ఒకేలా కనిపించింది. భారతదేశంలో ర్యాపిడ్ టెస్టు పాజిటివిటి రేటు 7 శాతం ఉంటే.. PCR టెస్టుల పాజిటివిటి రేటు దానికంటే రెండు నుంచి మూడింతలు ఎక్కువగా ఉండొచ్చునని నివేదిక తెలిపింది.



PCR పాజిటివిటి రేటు 15శాతం నుంచి 20 శాతం వరకు ఉంది. అంటే దీనిర్థం.. రోజువారీగా లక్షకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి.. వాస్తవానికి ఇండియాలో ప్రతిరోజు కరోనా కొత్త కేసులు 2 లక్షల నుంచి 2లక్షల 50వేలపైనే ఉన్నాయి.. దేశంలో కనీసం రోజువారీగా కొత్త కరోనా కేసులు 2 లక్షలపైనే నమోదవుతున్నాయి. కేసుల అంచనాను కచ్చితంగా గుర్తించలేని పరిస్థితి కనిపిస్తోంది.

READ  జలుబు వస్తే ముందు ఇవి మానేయండి

Related Posts