లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

SBI లో ఉద్యోగాల పేరుతో రూ.12 కోట్లు మోసం చేసిన నూతన్ నాయుడు

Published

on

dalit-tonsuring-case-nutan-naidu-swindled-rs-12-crore-from-two-youths-to-get-jobs

విశాఖ జిల్లాలో దళిత యువకుడి శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ నాయుడు బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు యువకుల వద్దనుంచి రూ. 12 కోట్లరూపాయలు కొట్టేశాడు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్టైన తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ మోసం వెలుగు చూసింది.

విశాఖ జిల్లా రావికమతంకు చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్ళకు చెందిన శ్రీకాంత్ రెడ్డి స్నేహితులు. హైదారాబాద్ లో నూకరాజు సీసీ కెమెరాలు, శ్రీకాంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేవారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా వారికి నూతన్ నాయుడుతో పరిచయం ఏర్పడింది. ఎస్బీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నూతన్ నాయుడు వారి వద్దనుంచి రూ. 12 కోట్లు రూపాయలు తీసుకున్నాడు.ఎస్బీఐలో ఉద్యోగం కోసం నూకరాజు రూ.5లక్షలు, ఎస్బీఐ సౌత్ రీజియన్ డైరెక్టర్ పోస్టు కోసం శ్రీకాంత్ రెడ్డి రూ. 12 కోట్లు చెల్లించాడు. రెండేళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోయే సరికి తాము మోసపోయామని వారు గ్రహించారు. దీంతోవారు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్


అంత భారీ స్ధాయిలో శ్రీకాంత్ రెడ్డి డబ్బులు ఇవ్వగలడాలేదా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. భాధితుల ఫిర్యాదు ఆధారంగా మహారాణి పోలీసులు కేసు నమోదు చేశారు.ఇప్పటికే శిరో ముండనం కేసులో డైలులో ఉన్న నూతన్ నాయుడిని కస్టడీలోకి తీసుకుని మోసం కేసు కూడా విచారణ చేయనున్నారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *