14ఏళ్ల విద్యార్థినికి టీచర్ లైంగిక వేధింపులు..23ఏళ్ల తరువాత అరెస్ట్ చేసిన పోలీసులు..అరుదైన కేసులో వెలుగులోకొచ్చిన అకృత్యాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

23 years on darjeeling women sexuval herasment complint : 14 ఏళ్ల పసిప్రాయంలో టీచర్ తన ఒంటిని చేత్తో అసహ్యంగా ఎక్కడపడితే అక్కడ తాకుతూ..నిమురుతూ..చేతికందినచోటల్లా నొక్కొస్తుంటే అన్నింటినీ భరించిందా బాలిక. అవి లైంగిక వేధింపులు అని కూడా తెలియని లేత వయస్సు. అప్పడప్పుడే లేత మొగ్గ విచ్చుకుంటున్న దశలో తన శరీరంలో వచ్చే మార్పులకు కన్న తండ్రిలా చూసుకోవాల్సిన టీచర్ కామంతో కొవ్వెక్కి తనను నలిపేస్తుంటే ఏం జరుగుతోందో కూడా తెలియని ఆ అమయాకురాలు మౌనంగా అన్నింటినీ భరించింది.


టీచర్ చేసే వెర్రిచేష్టలు ఇష్టముండేది కాదు..అలాగని ఎదిరించే ధైర్యం కూడా లేదు. ఎవరికన్నా చెప్పాలన్న జ్నానంకూడా లేని పసిబాలికపై చేసిన ఈ అకృత్యాలు ఆ ఒక్కబాలికే గత 23 ఏళ్లుగా కాదు ఎంతోమంది బాలికలు దారుణ హింసకు గురయ్యారు. బ్యాడ్ టచ్. గుడ్ టచ్ ఏదో తెలియన పసిబాలికలపై 23 ఏళ్లుగా తన హింసను కొనసాగిస్తునే ఉన్న ఆ కామాంధుడి పాపం పండింది. 23 ఏళ్ల తరువాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన ఘటన పశ్చిమ్ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జరిగింది.


ఆనాడు ఆ టీచర్ చేతిలో లైంగిక వేధింపులకు గురైనా ఆ బాలిక 37ఏళ్ల మహిళ అయ్యింది. ఉన్నత చదువులు చదివి పెద్ద లాయర్ గా హాంకాంగ్ లో సెటిల్ అయ్యింది. లైంగిక హింసపై చేపట్టిన ‘‘మీటూ’’ఉద్యమం బలంగా కొనసాగుతున్న క్రమంలో ఆ కీచక టీచర్ పై కేసు నమోదు చేసిందా అలనాటి బాలిక..ప్రస్తుతం లాయర్ అయిన 37ఏళ్ల మహిళ. దీంతో బెంగాల్ పోలీసులు సదరు కీచక టీచర్ ని అదుపులోకి తీసుకుని విచారించగా..ఆనాటి నుంచి ఈ నాటి వరకూ అంటే గత 23 ఏళ్లు టీచర్ గానే కొనసాగుతూ బాలికలపై అదే లైంగిక వేధింపులను కొనసాగిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలటం గమనిచాల్సిన విషయం..


నిందితుడు జితేశ్ ఓజా రెండు దశాబ్దాల నుంచి 20 స్కూల్స్ ఫ్రీలాన్స్ టీచర్ గా పనిచేస్తూ..తనతోపాటు జూనియర్ల సహా అనేక మందిని లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 2019 సెప్టెంబరులో ఈ మెయిల్ ద్వారా బాధితురాలు డార్జిలింగ్ సాదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఓజా తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పేర్కొంది.


దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆనాటి బాలిక నేటి మహిళ ఇచ్చిన వివరాలతో ఏడాదిపాటు శ్రమించి నిందితుడి గురించి విచారించి ఆధారాలు సేకరించారు పోలీసులు..ఓజా చేతిలో కొత్తవారు కూడా వేధింపులు ఎదుర్కొన్న మరికొందరు బాధితులను గుర్తించారు. అలా నిందితుడుచేసిన వేధింపుల ఆరోపణలు నిర్ధారించుకున్న పోలీసులు ఎట్టకేలకు అక్టోబరు 5న ఓజాను అదుపులోకి తీసుకున్నారు. సిలిగురిలో ఓ అద్దె ఇంట్లో నిందితుడు భార్య, కుమారుడితో ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.


కాగా ఎప్పుడో 14ఏళ్ల వయస్సులో ఓజా చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కొని 23 ఏళ్ల తరువాత సదరు మహిళ ఫిర్యాదును పక్కనబెట్టడానికి తమకు ఎటువంటి కారణం కనిపించలేదని డార్జిలింగ్ ఎస్పీ రాహుల్ పాండే అన్నారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని..నిందితుడు సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నట్టు గుర్తించామని తెలిపారు.


ఫిర్యాదు చేసిన మహిళ నుంచి మరిన్ని వివరాల తీసుకుని..మరింత మందిని ప్రశ్నించగా అతడి గురించి వెల్లడించిన నిజాలు విన్న మాకే విస్మయం కలిగిందనీ 23ఏళ్లుగా టీచర్ గా కొనసాగుతూ బాలికలపై తన లైంగిక వేధింపుల్ని కొనసాగిస్తున్న ఇటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అందుకే సదరు మహిళ చేసిన ఫిర్యాదుకు స్పందించి విచారణ చేపట్టామని ఈ విచారణలో సదరు నిందితుడు ఎంతోమంది బాలికల్ని తీవ్ర వేధింపులకు గురిచేశాడనీ..వయస్సు పెరిగినా నేటికీ అదే వేధింపులు మానలేదని తెలిసి తాము ఆశ్చర్యపోయామని ఎస్పీ తెలిపారు.


కాగా..అక్టోబరు 5న ఓజాను అరెస్ట్ చేసి.రెండు రోజులు కస్టడీలో విచారించారు. ప్రస్తుతం అతడికి న్యాయస్థానం అక్టోబరు 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదో అసాధారణ కేసని, రెండు దశాబ్దాలకుపైగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని డార్జిలింగ్‌కు చెందిన అనిర్బన్ గుహా థాక్రూటా అనే క్రిమినల్ లాయర్ తెలిపారు.


దీనిపై ఇన్నేళ్ల తరువాత తాను ఫిర్యాదు చేయటానికి గల కారణాలపై సదరు మహిళ మాట్లాడుతూ..ఇన్నేళ్లు అతడి అకృత్యాలపై తాను మౌనంగా ఉండటానికి అప్పట్లో తనకు అవగాహన లేకపోవడం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కు తనకు తేడా తెలియకపోవడమేనని అన్నారు. ఈ విషయాల గురించి స్కూల్‌లోనూ ఎవ్వరీ చెప్పలేదనీ..తరువాత తాను హాంకాంగ్ వెళ్లిపోయిన తర్వాత స్కూల్ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు ఎదురైన భయంకర అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.


‘నిందితుడు ఇప్పటికీ వాటిని కొనసాగిస్తున్నాడని తెలుసుకున్నాను.. ముఖ్యంగా ట్యూషన్ కోసం వెళ్లే అమ్మాయిల్ని వేధిస్తున్నట్టు తెలిసింది… అసభ్యకరంగా తాకి ఎవరికీ చెప్పొద్దని బెదిరించడం, బలవంతంగా ముద్దుపెట్టుకోవడం ఇంకా వెర్రిమిర్రి చేష్టలతో బాలికల్ని వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిసి అతన్ని వదలకూడదనే ఉద్ధేశ్యంతో తాను ఫిర్యాదు చేశానని తెలిపారామె.


అవన్నీ వింటుంటే తాను 14 ఏళ్ల వయస్సులో ఎంతటి క్షోభ అనుభవించిందో..ఎంత నరకం అనుభవించిదో..అవి భరించలేక..ఎవ్వరికీ చెప్పుకోలేక..ఎలా చెప్పాలో కూడా తెలీక ఎంత బాదపడిందో గుర్తుకొచ్చి ఒళ్లంతా గగుర్పొడిచేదనీ అందకే నాలా ఎంతోమంది ఆ కీచకుడి బారిన పడ్డారని తెలిసి రక్తం మరిగిపోయింది. వీడికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్ధేశ్యంతో ఫిర్యాదు చేశానని తెలిపారామె.

READ  పోలీసులకు పుట్టిన రోజు సెలవులు.. ఎక్కడంటే..

Related Posts