నా సోదరితో కలిసి కూర్చుంటే సమస్య సెటిల్ అవుతుంది: దాసరి అరుణ్ కుమార్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దర్శకరత్న దివంగత దాసరి నారాయణ రావు ఇద్దరి తనయుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా అన్నయ్య ప్రభు చేసిన ఆరోపణలపై అరుణ్ కుమార్‌ 10TVతో మాట్లాడారు.

 

‘‘నేను ఎవరి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లలేదు.. నా అడ్రస్ ప్రూఫ్‌లు అన్ని అదే ఇంటి అడ్రస్‌తో ఉన్నాయి.. ఆ ఇల్లు అతనొక్కడిదే కాదు నాది కూడా … నాకు కొరియర్ వస్తే.. తీసుకోవడానికి వెళ్ళాను.. అంతే తప్ప నేను గొడవేం చేయలేదు.. ముందు తాగి దూకానని చెప్పడం కరెక్ట్ కాదు..నేను పోలీసులు సమక్షంలోనే కొరియర్ తీసుకొన్నాను.. మందు తాగి దూకితే కింద అంత పెద్ద గేట్ కింద పడిపోయేవాణ్ణి కదా..

 

ఇద్దరి మధ్య గత ఏడాది మే నుండి గొడవ నడుస్తోంది.. నా పై అప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.. నా సోదరితో కలిసి కూర్చుంటే సెటిల్ అవుతుంది.. గతంలోనే మురళీ మోహన్, మోహన్ బాబు, సి. కళ్యాణ్ వంటి సినీ ప్రముఖులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు.. ఆ ఇంటి పై కోర్టు ఆర్డర్ ఉంది.. ముగ్గురిలో ఎవరు కూడా ఒకరికి తెలియకుండా మరొకరు అమ్ముకోవద్దు.. నేను లాకర్ తెరవడానికి ప్రయత్నించాను అని అనడంలో అర్థం లేదు. నాకెందుకో మా సోదరుడు డిప్రెషన్‌లో ఉన్నాడు అనిపిస్తోంది’’.. అంటూ దాసరి ప్రభు తనపై చేసిన ఆరోపణలను ఖండించారు దాసరి అరుణ్ కుమార్.

Read: ఇన్‌‌స్టాలో హీటెక్కిస్తున్న శృతి హాసన్

Related Posts